అక్షరటుడే, వెబ్‌డెస్క్: Divvela Madhuri | ఎట్టకేలకి బిగ్ బాస్ హౌజ్ (Bigg Boss house) లోకి దివ్వెల మాధురి అడుగుపెట్టింది. వాళ్లు మాస్క్ వేసుకుని ఆమె ఆడుతోంది.
నేను వాళ్ల అసలు ముఖం చూపిస్తా అంటూ ఫైర్ బ్రాండ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) సపోర్ట్‌తోనే షోలోకి వచ్చానని, ఆయన కోసం ఏదైనా చేస్తానని ప్రకటించింది.
బిగ్ బాస్ తెలుగు 9 Bigg Boss telugu ఐదో వారం ఎపిసోడ్ రచ్చ రచ్చగా మారింది. ఒకవైపు ఎలిమినేషన్ జరుగుతుండగా, మరోవైపు ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఈసారి వచ్చిందంతా ఫుల్ ఫైర్ ప్యాక్! అందులో సోషల్ మీడియా, పొలిటికల్ సెన్సేషన్ దివ్వెల మాధురీ ఎంట్రీతో హౌజ్ హీట్ మరింత పెరిగిపోయింది.
ఇప్పటికే ఆమె ఎంట్రీ గురించి చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. చివరికి ఆ రూమర్స్‌కి ఫుల్ స్టాప్ పెడుతూ ఆదివారం ఎపిసోడ్‌లో దివ్వెల మాధురీ బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టింది. ఎంట్రీ ఇచ్చిన వెంటనే తన స్ట్రాంగ్ పర్సనాలిటీని చూపిస్తూ “నేను ఫైర్ బ్రాండ్” అని డిక్లేర్ చేసింది.
Divvela Madhuri | తన కష్టాలని పంచుకున్న మాధురీ
హౌజ్‌లోకి అడుగుపెట్టిన వెంటనే మాధురీ Madhuri తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పి అందరినీ షాక్‌కు గురి చేసింది.
తనకు ఇంటర్‌లోనే పెళ్లి జరిగిందని తెలిపింది. ఇద్దరు కుమార్తెలు ఆరాధ్య, అఖిల ఉన్నారని చెప్పింది. కానీ భర్తతో అండర్‌స్టాండింగ్ సమస్యలు తలెత్తడంతో విడిపోవాల్సి వచ్చిందని పేర్కొంది.
ఎన్నో ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కాలేదని తెలిపింది. అప్పుడు తనలాగే జీవితంలో ఒంటరిగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్‌కి దగ్గరయ్యానని చెప్పింది.
“ఆయన కూడా తన కుటుంబాన్ని కోల్పోయారు.. ఇద్దరం బాధల్లో కలిశాం.. ఒకరికొకరం అండగా మారాం..” అని చెప్పిన మాధురీ ఎమోషన్ అయ్యింది.
భర్తను వదిలి, దువ్వాడ శ్రీనివాస్‌తో Srinivas రిలేషన్ మొదలైన తర్వాత సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నానని మాధురీ తెలిపింది.
”రెండేళ్ల పాటు ప్రతి రోజూ నరకం చూశాను. నన్ను చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు.. వ్యక్తిత్వ హననం చేశారు. అలాంటి సమయంలో లైఫ్ సెకండ్ ఛాన్స్ ఇస్తుందని అంటారు. ఇప్పుడు అదే జరిగింది. బిగ్ బాస్ హౌజ్‌లో మాధురీ 2.0ని చూస్తారు..” అని తెలిపింది.
బయట ప్రజల్లో 80% మంది తనని అర్థం చేసుకున్నారని, మిగతా 20% మంది ఇంకా హేట్ చేస్తున్నారని పేర్కొంది మాధురీ.
”వాళ్లకి దగ్గర కావాలి.. వాళ్ల అభిప్రాయాన్ని మార్చాలి.. అందుకే బిగ్ బాస్ షోలోకి వచ్చాను.. నా నిజమైన రూపం, నా రియాలిటీని చూపిస్తా” అని చెప్పింది.
హౌజ్‌లో ఇమ్మాన్యుయెల్ తప్ప ఫేవరెట్ ఎవరూ లేరని చెప్పిన మాధురీ. మిగిలిన కంటెస్టెంట్ల రియాలిటీని బయటపెడతానని వార్నింగ్ ఇచ్చింది.
హౌజ్‌లోకి వెళ్లే ముందు కన్నడ బిగ్ బాస్ హోస్ట్ సుదీప్.. ఆమెకు గోల్డెన్ బజర్ అనే సూపర్ పవర్ ఇచ్చారు. దీని ద్వారా ఈ వారం డేంజర్ జోన్‌లో ఉన్న ఒక కంటెస్టెంట్‌ను సేవ్ చేసే అవకాశం ఉంది.