HomeUncategorizedBigg Boss | బిగ్​బాస్ 9లో దివ్వెల మాధురి ఎంట్రీ ఖాయం.. రాజా వ‌స్తే...

Bigg Boss | బిగ్​బాస్ 9లో దివ్వెల మాధురి ఎంట్రీ ఖాయం.. రాజా వ‌స్తే ర‌చ్చ వేరే లెవ‌ల్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bigg Boss | తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో రాజకీయాలతో పాటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారిన జంట దువ్వాడ శ్రీనివాస్ – దివ్వెల మాధురి. వీరి వ్యక్తిగత జీవితం ఎంత హాట్ టాపిక్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇటీవ‌ల ఓ పెళ్లిలో ఈ ఇద్ద‌రు క‌లిసి డ్యాన్స్ వేసి హంగామా సృష్టించారు. ప‌లు యాడ్స్‌లో క‌నిపించి సంద‌డి చేశారు. ఇక ఇప్పుడు వారికి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. మాధురి బిగ్​బాస్ 9లోకి (Bigg Boss 9) ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఆమె ఎంట్రీ ఇవ్వ‌డం దాదాపు ఖాయ‌మైన‌ట్టే అని అంటున్నారు. మ‌రి దీనిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. అయితే మాధురితో పాటు దువ్వాడ శ్రీనివాస్‌ (Duvvada Srinivas)ని కూడా హౌజ్‌లోకి పంపిస్తే షో మ‌రింత ర‌క్తి క‌డుతుంద‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు.

Bigg Boss | ఎంట్రీ ప‌క్కా..

ఆంధ్రప్రదేశ్​లో 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆయన భార్య వాణికి దూరంగా, మాధురికి (Divvela Madhuri) దగ్గరగా ఉంటున్నట్టు వార్తలు రావడంతో, ఈ సంబంధం పెద్ద చర్చనీయాంశమైంది. మీడియా ముందు దివ్వెల మాధురి, “ఇది అడల్ట్రీ కాదు” అంటూ స్పష్టత ఇవ్వడంతో, ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ అయింది. ఇంటి ముందు భార్యా బిడ్డలు ధర్నాలు చేసినా కూడా దువ్వాడ శ్రీనివాస్ ఏ మాత్రం ప‌ట్టించుకోలేదు. మరోవైపు ఎవ‌రెన్ని విమ‌ర్శ‌లు చేస్తున్నా కూడా సమాజంలోనూ, సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్ – దివ్వెల మాధురి జంట అన్యోన్యంగా ఉంటుంది.

ఇప్పుడు ఫిలింనగర్ (Film Nagar) టాక్ ప్రకారం, ‘బిగ్​బాస్ తెలుగు సీజన్ 9’లో దివ్వెల మాధురి ఎంట్రీ దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది. గత సీజన్ నుంచే ఆమె పేరు చర్చల్లో ఉంది కానీ, ఈసారి టీమ్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె ‘రాజా’ అని ముద్దుగా పిలిచే దువ్వాడ శ్రీనివాస్ కూడా ఎంటర్ అవుతారా? అనే చర్చ నడుస్తోంది, అయితే అతని ఎంట్రీపై స్పష్టత లేదు. హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న మ‌రికొద్ది మంది సెల‌బ్రిటీల లిస్ట్ చూస్తే.. దేబ్ జాన్ మోదక్ – టీవీ సీరియల్స్‌ ద్వారా పాపులర్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ – కామెడీ షో ఫేమ్, అలేఖ్య చిట్టి – పికిల్ వ్యవహారం ద్వారా గుర్తింపు, రమ్య మోక్ష కంచర్ల – యువతలో ఫాలోయింగ్, సుమంత్ అశ్విన్ – టాలీవుడ్ యాక్టర్, జ్యోతి రాయ్ – నటి, తేజస్విని గౌడ – అమర్ దీప్ చౌదరి భార్యగా గుర్తింపు తెచ్చుకుంది. ఈసారి బిగ్​బాస్ షోలో కొంతమంది సామాన్యులకి కూడా అవకాశం కల్పిస్తున్నారు. దీనికోసం ‘బిగ్​బాస్ అగ్నిపరీక్ష’ పేరుతో ఓ రియాలిటీ షో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ షో షూటింగ్ జరుగుతోంది.