HomeతెలంగాణDuvvada Srinivas | కుమార్తె హాఫ్ శారీ ఫంక్ష‌న్.. డ్యాన్స్‌తో దుమ్ము రేపిన దువ్వాడ శ్రీనివాస్,...

Duvvada Srinivas | కుమార్తె హాఫ్ శారీ ఫంక్ష‌న్.. డ్యాన్స్‌తో దుమ్ము రేపిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Duvvada Srinivas | ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ Duvvada Srinivas గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయ‌న‌క్క‌ర్లేదు. ఏదో ఒక రకంగా దువ్వాడ శ్రీనివాస్ పేరు ఏపీ రాజకీయాల్లో, మీడియాలో నానుతూ ఉంటుంది. భార్య దువ్వాడ వాణితో విభేదాలు, ఇంటి వద్ద జరిగిన హంగామాతో కొన్ని రోజుల పాటు హాట్ టాపిక్‌గా నిలిచాడు దువ్వాడ శ్రీనివాస్. ఆ త‌ర్వాత దివ్వెల మాధురి(Divvela Madhuri)తో స‌న్నిహితంగా ఉంటూ వార్త‌ల‌లోకి ఎక్కారు. అనంత‌రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(Deputy CM Pawan Kalyan)పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేతలు ఫిర్యాదు చేయడంతో దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు నమోదు చేయడంతో ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు.

Duvvada Srinivas | డ్యాన్స్ అద‌ర‌గొట్టారు..

అయితే దివ్వెల మాధురి Divvela Madhuri పెద్ద కుమార్తె వాణి ఫంక్షన్ హైదరాబాదులో అట్టహాసంగా జరిగింది. ఆదివారం జరిగిన ఈ ఫంక్షన్ లో MLC దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట స్టేజ్‌పై త‌మ‌దైన శైలిలో డ్యాన్స్ చేసి ఆక‌ట్టుకున్నారు. స్టేజ్‌పై హిందీ పాట‌కి ఈ ఇద్ద‌రు చేసిన డ్యాన్స్(Dance) అంద‌రిని అల‌రించింది. మిరిమిట్లు గొలిపే లైటింగ్, కలర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్, భారీ డెకరేషన్ తో పెద్ద స్టేజ్ ఏర్పాటు చేయ‌గా, అందుకు తగ్గట్టు కాస్ట్లీ కాస్ట్యూమ్స్ తో ఓల్డ్ సాంగ్స్ కి తగ్గ స్టెప్స్ వేసి స్టేజ్ ను షేక్ చేశారు దువ్వాడ, దివ్వెల జంట. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అయింది.

దువ్వాడ, దివ్వెల జంట స్వస్థలం శ్రీకాకుళం జిల్లా అయినప్పటికీ వకుళ సిల్క్స్ పేరిట ఈ జంట హైదరాబాద్ Hyderabad లో వస్త్ర వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. దీంతో ఇటీవల ఎక్కువగా ఈ జంట హైదరాబాద్ లో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మాధురి తన కుమార్తె ఆఫ్ శారి ఫంక్షన్ ను హైదరాబాద్ లోనే జరిపించారు. ఈ వేడుకను శంషాబాద్ శివారులోని ఓ రిసార్ట్‌లో నిర్వహించినట్లు స‌మాచారం. ప్రియుడు దువ్వాడ శ్రీనివాస్ ఈ ఫంక్షన్ లో అంతా తానై వ్యవహరించారు. ఈ ఫంక్షన్ కి శ్రీకాకుళం జిల్లాకి చెందిన సెలెక్టెడ్ పర్సన్ ని ఆహ్వానించారు. హైదరాబాద్ లోని పలువురు రియల్టర్లు, సినీ ఆర్టిస్టులు హాజరయ్యారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి మధ్య సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్ని విమర్శలు వస్తున్నా వారు మత బంధాన్ని కొనసాగిస్తున్నారు. వారికి సంబంధించిన చిన్న విషయం అయినా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.