- Advertisement -
HomeజాతీయంAlimony | పెళ్లయిన ఏడాదికే విడాకులు.. రూ.5 కోట్ల భరణం కోరిన భార్య.. సుప్రీంకోర్టు ఆగ్రహం

Alimony | పెళ్లయిన ఏడాదికే విడాకులు.. రూ.5 కోట్ల భరణం కోరిన భార్య.. సుప్రీంకోర్టు ఆగ్రహం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Alimony | దేశంలో ఇటీవల విడాకుల (Divorce) భరణం కేసులపై తీవ్ర చర్చ జరుగుతోంది. కొందరు మహిళలు భర్తల నుంచి భారీ మొత్తంలో భరణం డిమాండ్​ చేస్తున్నారు.

పెళ్లయిన కొన్నాళ్లకే కొందరు మహిళలు విడాకులు కోరుతున్నారు. అంతేగాకుండా భర్తల నుంచి భారీ మొత్తంలో డబ్బులు అడుగుతున్నారు. ఇలాంటి వారి తీరుపై కోర్టులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సంపాదించే స్థోమత ఉన్న మహిళలు సైతం భర్తల నుంచి భరణం అడుగుతుండటం గమనార్హం. తాజాగా ఓ మహిళ భర్త నుంచి ఏకంగా రూ. ఐదు కోట్లు భరణం కావాలని కోరింది.

- Advertisement -

Alimony | తీర్పు కఠినంగా ఉంటుంది

ఓ జంటకు ఏడాది క్రితం వివాహం అయింది. అయితే భార్య విడాకులు కావాలని కోరింది. ఈ మేరకు సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించింది. అంతేగాకుండా రూ.5 కోట్లు భరణం కావాలని డిమాండ్​ చేసింది. ఆమె భర్త రూ.35 లక్షలు ఇవ్వడానికి అంగీకరించాడు. అయితే ఆమె మాత్రం రూ.5కోట్లు కావాలని పట్టుబట్టింది. ఈ కేసు మంగళవారం జె.బి పార్దివాలా ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా జడ్జి సదరు మహిళ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు తాము ఇచ్చే తీర్పు కఠినంగా ఉంటుందని హెచ్చరించారు.

Alimony | ఆమెను ఎందుకు పిలుస్తున్నారు

భర్త తరఫు లాయర్​ వాదిస్తూ.. తిరిగి కలవడానికి ఆమెతో చర్చలు చేశామని కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఆమెను ఎందుకు తిరిగి పిలుస్తున్నారని ప్రశ్నించారు. తిరిగి పిలవడం ద్వారా మీరు పెద్ద తప్పు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆమెను భరించలేరు. ఆమె కలలు చాలా పెద్దవి అని న్యాయమూర్తి పేర్కొన్నారు. అంతేగాకుండా సుప్రీంకోర్టు మ్యుటేషన్ సెంటర్లో మరోసారి చర్చించుకోవాలని వారికి సూచించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News