అక్షరటుడే,లింగంపేట: Mla Madan Mohan | కేకేవై రహదారిపై (KKY Road) లింగంపల్లి (Lingampally) కుర్దు పాములవాగు వంతెన వద్ద నూతనంగా నిర్మిస్తున్న డైవర్షన్ వంతెన పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే మదన్మోహన్రావు ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా శనివారం డైవర్షన్ వంతెన పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డైవర్షన్ వంతెన నిర్మాణం కోసం రూ.కోటి మంజూరు చేయించానన్నారు.
Mla Madan Mohan | అధికారుల తీరుపై అసహనం..
వంతెన పనులు నెమ్మదిగా సాగడంతో అధికారులపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. వంతెన పనులు జరుగుతుండడంతో నెలన్నర రోజులుగా బస్సులు నడవలేని పరిస్థితి ఎదురైందని అన్నారు. ప్రధానంగా కామారెడ్డికి, ఎల్లారెడ్డికి బస్సు నిలిచిపోయాయన్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర నారాగౌడ్, ఆర్అండ్బీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు.