అక్షరటుడే, ఇందూరు: Grain collection | వానాకాలం సీజన్లో వరి ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచిందని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Grain collection | కలెక్టర్ భేష్..
నిజామాబాద్ జిల్లాలో (Nizamabad district) ఇప్పటికే దాదాపు 50శాతం మేర 3.47 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ పూర్తి చేయడం పట్ల కలెక్టర్‌ను సంబంధిత అధికారులను మంత్రులు అభినందించారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన ధాన్యాన్ని సైతం పూర్తిస్థాయిలో సేకరించేలా చూడాలని..లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
Grain collection | వానాకాలం సీజన్లో..
ఈ సీజన్లో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం కాగా… 717 కేంద్రాలను నెలకొల్పి 50శాతం పూర్తి చేశామని కలెక్టర్ ఈ సందర్భంగా వివరాలు వెల్లడించారు. సేకరించిన వరి ధాన్యంలో సన్నరకం 3.21 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, దొడ్డు రకం 25.9 వేల మెట్రిక్ టన్నులు మాత్రమేనని వివరించారు. సేకరించిన ధాన్యానికి సంబంధించి రైతులకు వారి ఖాతాల్లో రూ.549.85 కోట్ల బిల్లులు చెల్లించామన్నారు.
సోమవారం ఒక్కరోజే రూ.105 కోట్ల బిల్లులు చెల్లింపులు జరిగాయని వారి దృష్టికి కలెక్టర్ తీసుకువచ్చారు. మొక్కజొన్న, సోయాబీన్ కొనుగోలు కేంద్రాలను (purchasing centers) కూడా రైతుల సౌకర్యార్థం అవసరమైన చోట ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 17వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు జరిగిందని, 25వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న సేకరణ జరుగుతుందన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, డీఎస్వో అరవింద్ రెడ్డి, సివిల్ సప్లై డీఎం శ్రీకాంత్ రెడ్డి, మార్క్ఫెడ్ డీఎం మహేష్, మార్కెటింగ్ శాఖ ఏడీ గంగుబాయి తదితరులు పాల్గొన్నారు.
