అక్షరటుడే, ఇందూరు: Eruvaka Foundation Award | జిల్లా కేంద్రంలోని పద్మా నగర్‌కు చెందిన డాక్టర్ సింగం సుస్మిత ఏపీలోని ఏరువాక ఫౌండేషన్ వార్షిక అవార్డు (Eruvaka Foundation Award) అందుకుంది. ఉత్తమ సృజనాత్మక ఆలోచన విభాగం–2024 అవార్డుకు గాను ఆమెను ఎంపిక చేశారు.
పద్మా నగర్‌కు చెందిన లావణ్య, పోశెట్టి దంపతుల కూతురు డాక్టర్ సుష్మిత పశ్చిమబెంగాల్లోని బీదాన్ చంద్ర విశ్వవిద్యాలయంలో (Bidan Chandra University) వ్యవసాయ కీటక శాస్త్రంలో పీహెచ్డీ చేశారు. ఆమెకు అవార్డు రావడంపై ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.