Homeజిల్లాలుకామారెడ్డిLandmine explosion| 8 నెలల క్రితమే పెళ్లి.. మావోల దాడిలో జిల్లావాసి మృతి

Landmine explosion| 8 నెలల క్రితమే పెళ్లి.. మావోల దాడిలో జిల్లావాసి మృతి

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి : Landmine explosion| ఆపరేషన్​ కర్రెగుట్టల్లో operation karreguttalu కూంబింగ్​ నిర్వహిస్తున్న భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర పేల్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందగా.. అందులో కామారెడ్డి kamareddy district జిల్లా పాల్వంచ మండల కేంద్రానికి చెందిన వడ్ల శ్రీధర్ కూడా ఉన్నాడు. శ్రీధర్ నాలుగేళ్ళ క్రితం కానిస్టేబుల్​గా ఉద్యోగం పొంది గ్రేహౌండ్స్ Greyhounds విభాగంలో చేరాడు.

ఆపరేషన్​ కర్రెగుట్టల్లో భాగంగా కొద్దిరోజులుగా సెర్చ్​ ఆపరేషన్ Search operationలో పాల్గొంటున్నాడు. ఇంతలోనే మావోయిస్టులు పేల్చిన మందుపాతర పేలి తనువు చాలించాడు. కాగా శ్రీధర్​కు గతేడాది ఆగస్టులో వివాహం అయింది. పెళ్లై ఏడాది కూడా తిరగకముందే ఈ ఘటన చోటు చేసుకోవడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. శ్రీధర్​ మృతితో మాచారెడ్డి మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మావోయిస్టుల దాడిపై తెలంగాణ డీజీపీ జితేందర్ DGP Jitendar​ ప్రకటన విడుదల చేశారు. గురువారం ఉదయం 6 గంటలకు వాజేడు, పేరూరులో మావోయిస్టులు ల్యాండ్ మైన్లు పేల్చారని చెప్పారు. అనంతరం 40 మంది మావోయిస్టులు జవాన్లపై కాల్పులకు తెగబడ్డారని పేర్కొన్నారు. మందుపాతర పేలి శ్రీధర్‌, పవన్, సందీప్‌ మృతి చెందారని చెప్పారు. మావోయిస్టుల కోసం కూంబింగ్​ కొనసాగుతుందని ఆయన వివరించారు.