అక్షరటుడే, వెబ్డెస్క్: Minister Ponguleti | రాష్ట్రంలో త్వరలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలో మంత్రివర్గంలో చర్చించి జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు.
ఇందులో భాగంగా ప్రత్యేకంగా నివేదిక తెప్పించుకుని, అసెంబ్లీ (Assembly)లో చర్చించి అందరి ఆమోదంతోనే ప్రక్రియ చేపడతామని చెప్పారు. శాసనసభ సభ ప్రశ్నో త్తరాల సమయంలో పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
Minister Ponguleti | అశాస్త్రీయంగా జిల్లాలు, డివిజన్ల ఏర్పాటు
మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు (Revenue Divisions), మండలాల ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగిందన్నారు. ఇష్టానుసారంగా విభజన చేశారని వ్యాఖ్యానించారు. ఒకే నియోజకవర్గంలోని నాలుగు మండలాలు నాలుగు జిల్లాల్లో ఉండే దుస్థితి ఏర్పడిందన్నారు. అలాగే తమను పొగిడిన వారి కోసం ఒక రకంగా, మిగతా వాళ్ల కోసం మరో రకంగా విభజన చేశారని పేర్కొన్నారు. తమ అదృష్ట సంఖ్యను ఊహించుకొని సైతం అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేశారన్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త మండలాలు, డివిజన్ల ఆవశ్యకతను సైతం గుర్తించామని పొంగులేటి చెప్పారు.
Read also..: Telangana RTC | ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్న్యూస్.. త్వరలో కొత్తగా 2800 ఎలక్ట్రికల్ బస్సులు..