అక్షరటుడే, బాల్కొండ: Kabaddi coaching camp | హైదరాబాద్‌లోని బాచుపల్లిలో జరగనున్న జాతీయ స్థాయి కబడ్డీ శిక్షణ శిబిరానికి (national level kabaddi training camp) జిల్లా నుంచి క్రీడాకారులు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 25వ తేదీ నుంచి 28 వరకు ముప్కాల్‌లో 35వ సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీ (State Level Kabaddi Tournament) నిర్వహించారు.
ఈ టోర్నీలో ప్రతిభ చూపిన జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయి కబడ్డీ క్యాంప్‌నకు ఎంపికయ్యారు. బాలికల విభాగంలో స్నేహ, శిరీష, గౌతమి, బాలుర విభాగంలో శ్రీనివాస్, ప్రమోద్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులను జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఆంధ్యాల లింగయ్య, కార్యదర్శి గంగాధర్, కబడ్డీ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు అభినందించారు.
