Homeజిల్లాలునిజామాబాద్​BC Sankshema Sangham | బంద్​కు జిల్లా ప్రజలు సహకరించాలి..

BC Sankshema Sangham | బంద్​కు జిల్లా ప్రజలు సహకరించాలి..

నగరంలో ఈనెల 18న తలపెట్టిన బీసీ బంద్​కు అన్నివర్గాలు సహకరించాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయా వ్యాపార సంస్థల్లో వినతిపత్రాలు సమర్పించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: BC Sankshema Sangham | బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 18న తలపెట్టిన తెలంగాణ బంద్​కు (Telangana bandh) ప్రతిఒక్కరూ సహకరించాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు కోరారు. జిల్లా కేంద్రంలోని పలు వ్యాపార సంస్థలు, మర్చంట్ అసోసియేషన్​లకు (merchant associations) బుధవారం వినతిపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పోరాటం న్యాయపోరాటమని, అన్ని వర్గాల వారు సహకరించాలని కోరారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చేవరకు ఈ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షుడు దేవేందర్, శంకర్, అజయ్, స్వామి, విజయ్, బాలన్న, చైతన్య తదితరులు పాల్గొన్నారు.