అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Padmashali Sangham | జిల్లా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నగరంలో ఖలీల్వాడిలో గల (Khaleelwadi) జిల్లా సంఘం భవనంలో ఆదివారం కార్యక్రమం నిర్వహించారు. అఖిల భారతీయ పద్మశాలి సంఘం సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ దాసరి నర్సింలు (Dasari narsimlu) ఆధ్వర్యంలో కార్యవర్గాన్ని ప్రకటించారు.
జిల్లా అధ్యక్షుడిగా మైసల నారాయణ (Misala Narayana), ప్రధాన కార్యదర్శిగా బొడ్డు గంగా ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా గాలిపల్లి నారాయణ, పాము రమేష్, అంకం జగదీష్, గంగుల దత్తాద్రి (ముప్కాల్), ఆరుట్ల రాజేంద్రప్రసాద్, సహాయ కార్యదర్శిగా దేవ బజరంగ్, పద్మ సుభాష్, సాంబారు తిరుపతి (నందిపేట), ఆర్గనైజింగ్ సెక్రెటరీగా ఉప్పరపల్లి నాగరాజు, ప్రచార కార్యదర్శిగా కూరపాటి వెంకట్, కోశాధికారిగా దిండిగళ్ల శంకర్‌ను ఎన్నుకున్నారు.
సలహాదారులుగా డాక్టర్ ఎం శ్రీహరి, డాక్టర్ కె సుభాష్, డాక్టర్ బి కేశవులు, పెంట దత్తాద్రి, గెంట్యాల వెంకటేశం, భీమర్తి రవి, కన్నా శ్రీనివాస్, ఉప్పరపల్లి శ్రీనివాస్‌ను ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా గర్దాస్ శంకర్, ఆడెపు రాజన్న, విట్టం వెంకటరమణ(నూత్ పల్లి), జట్ల బాలరాజ్ (ఎడపల్లి ), గంజి గణేష్,(నవీపేట్ ), షేర్ పల్లి బాబురావు, గంగుల గంగాధర్ (నందిపేట), దయానంద్ (హోన్నాజీపేట్ )లను ఎన్నుకున్నారు.
