అక్షరటుడే, ఇందూరు: Prajavani | ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరుకావాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) పేర్కొన్నారు.
కలెక్టరేట్లో (Nizamabad Collectorate) ఆయన సోమవారం ప్రజావాణిలో భాగంగా మాట్లాడారు. ఎంతో కీలకంగా భావించే ప్రజావాణికి జిల్లాస్థాయి అధికారులు హాజరుకాకపోతే సమస్యల పరిష్కారం మరింత ఆలస్యం అవుతుందన్నారు.
అత్యవసరమైతే తన అనుమతి తీసుకుని కిందిస్థాయి అధికారిని ప్రజావాణికి పంపాలని సూచించారు. సోమవారం మొత్తం 74 వినతులు అందాయి. పలుశాఖ అధికారులు గైర్హాజరు కావడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీపీవో శ్రీనివాస్ రావు, మెప్మా పీడీ రాజేందర్, ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.