అక్షరటుడే, ఇందూరు: Prajavani | ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు తప్పకుండా హాజరు కావాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) ఆదేశించారు. ప్రధానంగా కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని పంపించవద్దని ఉన్నతాధికారులే హాజరుకావాలని స్పష్టం చేశారు. అయితే సోమవారం నిర్వహించిన ప్రజావాణికి (Prajavani) పలు శాఖ అధికారులు గైర్హాజరయ్యారు. కొందరు కిందిస్థాయి అధికారులను పంపించారు.
ఇది గమనించిన కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఎంతో కీలకంగా భావించే ప్రజావాణికి జిల్లా అధికారులు (district officials) గైర్హాజరు కావడం సమంజసం కాదన్నారు. ప్రతి సోమవారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తప్పకుండా ఉండాలని ఆదేశించారు. ఎవరికైనా అత్యవసర పని ఉంటే ముందుగానే తమ దృష్టికి తేవాలని సూచించారు. అనుమతి లేకుండా ప్రజావాణికి గైరాహాజరయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Prajavani | ఇకపై అటెండెన్స్..
ప్రజావాణికి ఆయా శాఖల ఉన్నతాధికారులు గైర్హాజరు కావడంతో కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి ప్రజావాణికి అటెండెన్స్ తీసుకోవాలని సూచించారు. కాగా.. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 83 వినతులు అందాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్ (Additional Collector Ankit Kiran Kumar), ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, డీఆర్డీవో సాయా గౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీపీవో శ్రీనివాసరావు, మెప్మా పీడీ రాజేందర్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.