అక్షరటుడే, ఇందూరు: Judo Selections | రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో జిల్లా పేరు నిలబెట్టాలని జిల్లా క్రీడా యువజన శాఖ అధికారి (District Sports and Youth Department Officer) పవన్ కుమార్ తెలిపారు.
జిల్లా కేంద్రంలో సుభాష్ నగర్లో (Subhash nagar) ఉన్న ప్రభుత్వ స్విమ్మింగ్ పూల్ (Government swimming pool) ఆవరణలో జిల్లాస్థాయి జూడో సబ్ జూనియర్ (Judo Sub Junior sports), కేడర్ ఎంపిక పోటీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో ఆయా క్రీడాంశాల్లో అంతర్జాతీయస్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులు ఎందరో ఉన్నారన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. కాగా ఎంపికైన క్రీడాకారులు ఆగస్టు 5 నుంచి 7వ తేదీ వరకు వరంగల్లో (Waranagal) జరిగే రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో పీఈటీలు అనిత, శ్యామల, వికాస్, శ్రీకాంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.