అక్షరటుడే, ఇందూరు : Best Teacher Awards | ఉపాధ్యాయుల దినోత్సవాన్ని (Teachers Day) పురస్కరించుకొని జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను (Best Teachers) ఎంపిక చేశారు. అన్ని కేటగిరీల్లో కలిపి మొత్తం 40 మందిని ప్రకటించారు.
అయితే 5వ తేదీన సెలవు దినం కావడంతో మంగళవారం అవార్డులను ప్రదానం చేయనున్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఉదయం 11 గంటలకు కార్యక్రమం ఉంటుందని డీఈవో అశోక్ (DEO Ashok) తెలిపారు.
Best Teacher Awards | ఉత్తమ ఉపాధ్యాయులు వీరే..
ప్రధానోపాధ్యాయుల కేటగిరిలో.. హరిచరణ్ (కుకునూరు, వేల్పూర్), సురేష్ కుమార్ (డొంకేశ్వర్) రవీందర్ (మామిడిపల్లి), రాంప్రసాద్ (కోనాపూర్,కమ్మర్పల్లి).
స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో.. రాజశేఖర్ (ఏర్గట్ల, జెడ్పీహెచ్ఎస్), మల్లేష్ (రేంజర్ల జెడ్పీహెచ్ఎస్), శ్రీనివాసరాజు (టీజీఎంఎస్, బాల్కొండ), శ్రీనివాస్ (బాల్కొండ జెడ్పీహెచ్ఎస్), ప్రశాంత్ కుమార్ (బాల్కొండ జెడ్పీహెచ్ఎస్), ఎన్.శ్రీనివాస్ (మెండోరా, జెడ్పీహెచ్ఎస్), గణేష్ (ఆలూర్ జెడ్పీహెచ్ఎస్) స్రవంతి (ఆర్మూర్, కేజీబీవీ), సయ్యద్ అబ్దుల్ నహీం (నీలా జెడ్పీహెచ్ఎస్), గంగాధర్ (కుకునూర్ జెడ్పీహెచ్ఎస్), సుజాత (ముచ్కూర్ జెడ్పీహెచ్ఎస్), లక్ష్మీనారాయణ (ఎడపల్లి జెడ్పీహెచ్ఎస్), సాయిలు (డొంకేశ్వర్ జెడ్పీహెచ్ఎస్), స్వప్న (డిచ్పల్లి జెడ్పీహెచ్ఎస్).
Best Teacher Awards | ఎస్జీటీ కేటగిరీలో..
శివకుమార్ (శివతండా, నవీపేట్), పెద్ది రమణ (కుర్నాపల్లి, ఎడపల్లి), ఎస్కే అబ్దుల్ (వెల్మల్, నందిపేట్), ప్రవీణ్ కుమార్ రెడ్డి (గుంజిలి, మాక్లూర్), శ్రీనివాస్ (మోతె, వేల్పూర్), విజయలక్ష్మి (నాగపూర్, నవీపేట్), రాజు (ఇసాపల్లి, ఆర్మూర్), సునీత (ఆర్మూర్), వెంకటేశ్వర్లు (బర్దిపూర్, బోధన్) శృతిమ (శ్రీరాంపూర్, బాల్కొండ), అల్తాఫుద్దీన్ (ఫతేపూర్, సాలురా), నరేంద్ర శేఖర్ (బాగేపల్లి, రెంజల్).
Best Teacher Awards | ప్రత్యేక అవార్డులు..
శంకర్ (బోర్గాం, మొపాల్), సాయన్న (ఖిల్లా జీహెచ్ఎస్), హఫీజుద్దీన్ (బెజ్జోరా, భీమ్‌గల్), ఆదిల్ అహ్మద్ (నిజాం కాలనీ, నిజామాబాద్), శ్రీనివాస్ (చౌటుపల్లి, కమ్మర్పల్లి), కిషన్ (నారాయణపేట్, జక్రాన్‌పల్లి), శ్రీనివాస్ (వేంపల్లి, ముప్కాల్), సునీత (నాలేశ్వర్, నవీపేట్), సుజాత (పులాంగ్ నిజామాబాద్), రమేష్ (మానవతా సదన్, కేర్‌టేకర్).