అక్షరటుడే, వెబ్ డెస్క్: National Shiksha Ratna | ‘నవాచారి గతివిధియా సమూహ్’ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది అందించే జాతీయ శిక్షరత్న అవార్డుకు జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు ఎంపికయ్యారు.
ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు రాజారాం hm rajaraam, నరేష్ hm naresh ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 150 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేయగా, తెలంగాణ నుంచి నలుగురికి అవార్డు వరించింది. ఇందులో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు ఉండడం విశేషం. నరేష్ ధర్పల్లి మండలం రేకులపల్లి పాఠశాల, రాజారాం బాల్కొండ మండలం బుస్సాపూర్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు.