HomeతెలంగాణACB Trap | ఏసీబీకి చిక్కిన జిల్లా మత్స్యకార అధికారిణి

ACB Trap | ఏసీబీకి చిక్కిన జిల్లా మత్స్యకార అధికారిణి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు మారడం లేదు. పనుల కోసం తమ వద్దకు వచ్చే ప్రజలను డబ్బులు డిమాండ్​ చేస్తున్నారు.

రాష్ట్రంలోని పలు శాఖల్లో అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. ఇటీవల కాలంలో ఏసీబీ దాడులు (ACB Raids) పెరిగినా.. లంచాలకు మరిగిన అధికారులు మారడం లేదు. పైసలు ఇస్తేనే ప్రజల పనులు చేస్తున్నారు. లేదంటే కొర్రీలు పెట్టి కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. కొందరు అధికారులు లంచం తీసుకోవడం కూడా హక్కుగా భావిస్తున్నారంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తాజాగా నల్గొండ (Nalgonda) జిల్లా మత్స్యకార అధికారిణి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కింది.

ACB Trap | సభ్యులను చేర్చడానికి..

నల్గొండ కలెక్టరేట్ కార్యాలయంలో గల మత్స్యశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం దాడులు చేపట్టారు. జిల్లా మత్స్యకార అధికారిణి (District Fisheries Officer) ఎం చరితారెడ్డి లంచం తీసుకుంటుండగా రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. మత్స్య సహకార సంఘంలో కొత్త సభ్యులను చేర్చుకోవడానికి ఆమె రూ.20 వేల లంచం డిమాండ్​ చేశారు. బాధితులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బాధితుల నుంచి రూ.20 వేలు తీసుకుంటుండగా మత్స్యశాఖ అధికారి చరితారెడ్డిని ఏసీబీ అధికారులు గురువారం పట్టుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.

ACB Trap | యథేచ్ఛగా అవినీతి

మత్స్యశాఖలో పలువురు అధికారులు యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలోని చెరువుల ఆధారంగా ప్రభుత్వం మత్స్యసహకార సంఘాలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చింది. అలాగే కొత్త సభ్యులను చేర్చుకోవచ్చు. అయితే మత్స్యసహకార సంఘంలో సభ్యత్వం కోసం పలు పరీక్షలు ఉంటాయి. ఈ సమయంలో అధికారులు లంచాలు తీసుకుంటున్నారు. డబ్బులు ఇచ్చిన వారికే సభ్యత్వం ఇస్తున్నారు.

మత్స్య సహకార సంఘంలో సభ్యత్వం ఉంటే ప్రభుత్వం నుంచి కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. చేపల వేటకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు మృతి చెందితే బీమా అందుతుంది. అలాగే మత్స్యకారులకు ప్రభుత్వం అందించే పథకాలు పొందాలంటే సభ్యత్వం తప్పనిసరి. ఈ క్రమంలో చాలా మంది మత్స్యకారులు లైసెన్స్​ల కోసం దరఖాస్తు చేసుకుంటారు. దీంతో వారి అవసరాన్ని ఆసరాగా చేసుకొని మత్స్యశాఖ అధికారులు అందిన కాడికి దండుకుంటున్నారు.

ACB Trap | లంచం అడిగితే ఫోన్​ చేయండి

ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్​ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్​ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number)​, వాట్సాప్ నంబర్​ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.