అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Chief Advisor Sudarshan Reddy | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సహకారంతో జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy) తెలిపారు.
ఈ ప్రాంత అభివృద్ధే తమ ధ్యేయమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా (state government advisor) బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారి గురువారం జిల్లా కేంద్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా మాధవ నగర్ నుంచి బోర్గాం (పి) చౌరస్తా, వినాయకనగర్, అంబేద్కర్ చౌరస్తా, ప్రధాన వీధుల గుండా పాత జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు.
అనంతరం పాత కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్, కేసీఆర్ (KTR and KCR) తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు. వచ్చే ఎలక్షన్లలో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. కొంతమంది దద్దమ్మలు పనికిరాని మాటలు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, నిరుద్యోగులు, యువకులకు తెలంగాణలో పెద్దపీట వేసిందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక జిల్లాలో అనేక ప్రభుత్వ పాఠశాలలు (government schools) మెరుగుపడ్డాయని వివరించారు. విద్యార్థులకు మెరుగైన బోధన (Bodhan) అందుతోందని చెప్పారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల భవనాలు, విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 21 కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నారు.
Chief Advisor Sudarshan Reddy | అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు
కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు (Indiramma houses) అందిస్తోందని సుదర్శన్ రెడ్డి తెలిపారు. నిరుపేదలు ఇల్లు నిర్మించుకునేందుకు ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత ప్రాంతమని పేర్కొన్నారు. రైతులు లాభసాటి పంటలు సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు.
Chief Advisor Sudarshan Reddy | కేసీఆర్ హయాంలో ప్రజలకు అన్యాయం
పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ (PCC President Mahesh Kumar Goud) మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలకు అన్యాయం చేసిందన్నారు. కాళేశ్వరం పేరిట రూ.లక్షా 20వేల కోట్ల ప్రజాధనాన్ని గోదావరిలో పోసిన ఘనత కేసీఆర్‌దేనని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy), రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తే.. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా నాశనం చేసిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అందరి పార్టీ అని.. యువకులు, రైతులు, మహిళలు, నిరుద్యోగుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశలు పని చేస్తున్నారని చెప్పారు.
కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (Rural MLA Bhupathi Reddy), జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఈరవత్రి అనిల్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, విజయకాంత్ రెడ్డి, నుడా ఛైర్మన్ కేశ వేణు, మాజీ మేయర్ సంజయ్, కవితా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
![]()
