అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad Court | హత్య కేసులో జిల్లా న్యాయస్థానం (district court) సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి ఉరిశిక్ష విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బ్రాహ్మణ్కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ సందీప్, నాగారం కాలనీకి చెందిన సతీష్ గౌడ్ స్నేహితులు. అయితే గతేడాది ఆటో విషయంలో వీరిద్దరికి గొడవలు జరిగాయి. దీనిని మనసులో పెట్టుకున్న సతీష్ గౌడ్ సందీప్‌ను ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
Nizamabad Courts | ఇందల్వాయి వద్ద..
ప్రణాళిక ప్రకారం.. గతేడాది సతీష్ గౌడ్ సందీప్‌ను ఇందల్వాయికి (Indalwai) తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరు మద్యం సేవించిన అనంతరం సందీప్‌ను పెట్రోల్ పోసి తగుటబెడ్టాడు. అనంతరం ఆటో తీసుకుని పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఐదో టౌన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో సతీష్ గౌడ్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును విచారించిన జిల్లా న్యాయమూర్తి డి. దుర్గా ప్రసాద్ 238 బీఎన్ఎస్ ప్రకారం.. ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, 307 బీఎన్ఎస్ కింద ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5వేల జరిమానా.. 103 బీఎన్ఎస్ కింద రూ.10వేలు, మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని సీఐ శ్రీనివాస్ తెలిపారు.