4
అక్షరటుడే, ఇందూరు: Taekwondo Championship | హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో (Gachibowli Indoor Stadium) ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు జరిగే ఓపెన్ నేషనల్ తైక్వాండో ఛాంపియన్షిప్కు జిల్లా క్రీడాకారులు ఎంపికైనట్లు అసోసియేషన్ కార్యదర్శి మనోజ్ కుమార్ తెలిపారు. సోమవారం జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఎంపికైన క్రీడాకారులను ప్రెసిడెన్సి పాఠశాల (Presidency School) ప్రిన్సిపల్ పవన్ కుమార్ అభినందించారు. జాతీయ పోటీల్లో పతకాలు సాధించి జిల్లా పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు.