ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Smart Ration Cards | ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం.. సెప్టెంబర్ 15...

    Smart Ration Cards | ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం.. సెప్టెంబర్ 15 నాటికి 1.46 కోట్ల కుటుంబాలకు పంపిణీ లక్ష్యం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Smart Ration Cards | ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు స్మార్ట్ రేషన్ కార్డులు(Smart Ration Cards) ప్రవేశపెట్టారు. ఈ కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవాడ వరలక్ష్మీనగర్‌లో ప్రారంభించారు.

    రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “రేషన్ బియ్యం దుర్వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో సాంకేతికతను వినియోగించి స్మార్ట్ కార్డులు రూపొందించాం. ప్రతి కార్డులో QR కోడ్ ఉంటుంది. కార్డు ద్వారా రేషన్ తీసుకున్న వెంటనే రాష్ట్ర, జిల్లా స్థాయిలో సమాచారం అందేలా వ్యవస్థను రూపొందించాం” అని తెలిపారు.

     Smart Ration Cards | 9 జిల్లాల్లో ఇంటింటికీ పంపిణీ

    ప్రస్తుతం రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ఇంటింటికీ కార్డుల పంపిణీ జరుగుతోందని మంత్రి తెలిపారు. మొత్తం 1.46 కోట్ల కుటుంబాలకు సెప్టెంబర్ 15లోగా ఈ కార్డులు అందేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. కొత్త రేషన్ కార్డులతో పాటు చిరునామా మార్చిన వారికి కూడా కార్డులు అందజేస్తామని తెలిపారు. రేషన్ దుకాణాల వద్ద ఉన్న ఈ-పోస్‌ యంత్రాలను(E-POS Machines) ఆధునికీకరించడం జరుగుతోందని వెల్లడించారు. భవిష్యత్తులో గోధుమల పంపిణీ కూడా రేషన్ దుకాణాల ద్వారానే చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

    ప్రస్తుతం రాష్ట్రంలో 29,797 రేషన్ దుకాణాలు ఉన్నాయని, ప్రజల అవసరాల మేరకు వాటి సంఖ్యను పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. అవసరమయ్యే ప్రాంతాల్లో సబ్‌ డిపోలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని కూడా వివరించారు. ఇలా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి, రేషన్ పంపిణీలో పారదర్శకత, సమర్థత పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

    Latest articles

    Stock Market | దూసుకుపోయిన ఐటీ స్టాక్స్‌.. లాభాల బాటలో సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ఐటీ స్టాక్స్‌ దూసుకుపోవడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets)...

    Srisailam Temple | శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్​న్యూస్​.. 20 నిమిషాలకో బస్సు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Srisailam Temple | శ్రీశైలం మల్లన్న ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు దర్శనం...

    TMC MLA | గోడ దూకిన ఎమ్మెల్యే.. ఎందుకో తెలిస్తే షాక్​ అవాల్సిందే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TMC MLA | పశ్చిమ బెంగాల్​లో ఓ ఎమ్మెల్యే గోడ దూకి పారిపోవడానికి యత్నించాడు....

    Bank Jobs | పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు 85 వేల వరకు వేతనం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bank Jobs | లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌(Local bank officer) పోస్టుల భర్తీ కోసం...

    More like this