అక్షరటుడే, ఎల్లారెడ్డి : Grama Swarajya Organization | లింగంపేట మండలంలోని లింగంపల్లి ఖుర్ద్‌లో గ్రామ స్వరాజ్య స్వచ్ఛంద సంస్థ(Swarajya Charitable Organization) ఆధ్వర్యంలో శనివారం కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏపీఎం శ్రీనివాస్(APM Srinivas) మాట్లాడుతూ.. గత నెలలో 30రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న 30 మంది మహిళలకు సర్టిఫికెట్(Certificate)తో పాటు ఎస్‌బీఐ సహకారంతో కుట్టు మిషన్లు(Sewing Machines) అందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బండి రాజన్న, మాజీ ఉప సర్పంచ్ రవి, కార్యదర్శి భవాని, జిల్లా కో-ఆర్డినేటర్ రంగ వెంకటలక్ష్మి, మండల కో-ఆర్డినేటర్ లావణ్య, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు దుర్గవ్వ, తదితరులు పాల్గొన్నారు.
