అక్షరటుడే, వెబ్డెస్క్ : Lions Club | మోపాల్లోని బీసీ హాస్టల్ విద్యార్థులకు (BC hostel students) లయన్స్ క్లబ్ సభ్యులు రగ్గులు పంపిణీ చేశారు. ప్రస్తుతం చలితీవ్రత అధికంగా ఉంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ క్రమంలో లయన్స్ క్లబ్ మోపాల్ (Lions Club Mopal) ఆధ్వర్యంలో 55 మంది విద్యార్థులకు రగ్గులు పంపిణీ చేశారు. ప్రభుత్వం నుంచి బీసీ హాస్టళ్లకు రగ్గుల పంపిణీ లేనందున పిల్లలను చలి నుంచి కాపాడేందుకు తాము అందించినట్లు లయన్స్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భగవానులు, నర్సింహారావు, రెడ్ క్రాస్ ఛైర్మన్ బుస్స ఆంజనేయులు, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
