అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nizamabad | నగరంలోని బోర్గాం(పి) జెడ్పీ ఉన్నత పాఠశాలలో గాదె సతీష్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్కులు పంపిణీ చేశారు. పాఠశాల హెచ్ఎం శంకర్ మాట్లాడుతూ.. ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు నోట్ బుక్కులు అందజేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు రాజేశ్వర్, నరేందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
