అక్షర టుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad CP | నగరంలోని సీపీ కార్యాలయంలో వెల్‌నెస్ హాస్పిటల్ (Wellness Hospital) ఆధ్వర్యంలో మంగళవారం పలువురికి హెల్మెట్లు పంపిణీ చేశారు. సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) చేతులమీదుగా వెల్‌నెస్ హాస్పిటల్ సిబ్బందికి, ఇతర వాహనదారులకు 100 హెల్మెట్లు అందజేశారు.
ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, తద్వారా ప్రమాదాల బారిన పడితే ప్రాణాపాయం నుంచి రక్షించుకోవచ్చని చెప్పారు. సేవా కార్యక్రమాలు నిర్వహించడంపై హాస్పిటల్ నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో వెల్‌నెస్ హాస్పిటల్ యాజమాన్యం తాళ్ల సుమన్ గౌడ్, బోదు అశోక్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, సీఐ ప్రసాద్, ఆర్‌ఐ వినోద్, ఎస్సై వంశీకృష్ణ పాల్గొన్నారు.