అక్షరటుడే, ఆర్మూర్: Animal Husbandry Department | మండలాల్లో జీవాలకు పశుసంవర్ధక శాఖ (Animal Husbandry Department) ఆధ్వర్యంలో నట్టల నివారణ మందులను పంపిణీ చేస్తున్నారు. తద్వారా గొర్రెలకు, మేకలకు రోగాలు దరిచేరవని పశువైద్యులు పేర్కొంటున్నారు.
Animal Husbandry Department | ఆలూర్లోని రాంచంద్రపల్లి గ్రామంలో..
ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామంలో (Ramchandrapalli village) సర్పంచ్ భూషణ్, పంచాయతీ కార్యదర్శి నాగేంద్ర ఆధ్వర్యంలో శనివారం గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సందీప్ మాట్లాడుతూ.. 452 గొర్రెలకు, 193 మేకలకు నివారణ మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ మందుల వల్ల పశువులు తీసుకునే మేతలోని పోషకాలు శరీరానికి సమర్థంగా చేరి, వాటి పెరుగుదలతో పాటు ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు.
మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా పశువులకు వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగా టీకాలు, మందులు వేయించుకోవడం ఎంతో అవసరమని సూచించారు. ఇలా నివారణ చర్యలు చేపడితే పశుపాలకులకు ఆర్థికనష్టం తప్పుతుందన్నారు. అనంతరం సర్పంచ్ భూషణ్ మాట్లాడుతూ.. గ్రామ పశుసంపద రక్షణే లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ భూషణ్, పంచాయతీ కార్యదర్శి నాగేంద్ర, నర్సయ్య, సాయి, సరళ రాణి, రోజా తదితరులు పాల్గొన్నారు.
Animal Husbandry Department | దూదిగంలో..
అక్షరటుడే, మెండోరా: పశుసంవర్ధక శాఖ మండల శాఖ ఆధ్వర్యంలో దూదిగం గ్రామంలో (Dudigam village) మేకలు, గొర్రెలకు ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా. గంగాధరయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందుల పంపిణీని దూదిగం సర్పంచ్ మహమ్మద్ రషీద్ (బాబా), ఉపసర్పంచ్ అయిలి శ్రీనివాస్ పంపిణీ చేశారు.
కార్యక్రమంలో వార్డు సభ్యులు గంగాధర్, పసుల హరీష్, నరేష్, ఆఫ్తర్, గ్రామస్థులు ఏర్గట్ల ఏసు, కపిల్, రమేష్, నాగుల శ్రీను, ముస్తఫా, జీవాల పెంపకదారులు బొడ్డు మల్లేష్, రాజేశ్వర్, మల్లయ్య, పోశెట్టి పాల్గొన్నారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి గౌతమ్ రాజు, పశువైద్య సహాయకుడు ప్రవీణ్, ఆఫీస్ సబార్డినేట్ మల్లేష్ పాల్గొన్నారు.
