Homeజిల్లాలునిజామాబాద్​CMRF checks | లబ్ధిదారులకు సీఎంఆర్​ఎఫ్​ చెక్కుల పంపిణీ

CMRF checks | లబ్ధిదారులకు సీఎంఆర్​ఎఫ్​ చెక్కుల పంపిణీ

ముప్కాల్​, కమ్మర్​పల్లి మండలాల్లో కాంగ్రెస్​ నాయకులు సీఎంఆర్​ఎఫ్​ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు సీఎం రేవంత్​రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

అక్షరటుడే, ముప్కాల్​: CMRF checks | మండలంలోని కొత్తపల్లి గ్రామంలో కాంగ్రెస్ ​నాయకులు పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్​ చెక్కులను (CMRF checks) పంపిణీ చేశారు.

గ్రామంలోని జైడి స్వరూపకు రూ.18,000, క్యాతం రాజారెడ్డికి రూ.40,000, కలువ హరితకు రూ.12,000, మెర అమ్మైకి రూ.20,000 చెక్కులు అందజేశారు. ఈ చెక్కులను మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, నియోజకవర్గ ఇన్​ఛార్జి సునీల్​రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

CMRF checks | కమ్మర్​పల్లిలో..

అక్షరటుడే, కమ్మర్​పల్లి: CMRF checks | మండల కేంద్రంలో సోమవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను (CM Relief Fund cheques) కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సుంకెటరవి లబ్ధిదారులకు అందజేశారు. నూకల లక్ష్మికి రూ.19,500, సుంకెట గణేశ్​కు రూ.24,500, పత్రి లక్ష్మికి రూ. 36వేల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ చెక్కులు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్​ బాల్కొండ నియోజకవర్గ ఇన్​ఛార్జి సునీల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Must Read
Related News