అక్షరటుడే, ఆర్మూర్ : CMRF Cheques | ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామానికి (Ramchandrapalli Village) చెందిన మహిళకు సీఎం సహాయ నిధి (CM Relief Fund) నుంచి ఆర్థికసాయం అందించారు. గ్రామానికి చెందిన బుద్దె శారద ఇటీవల తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి చికిత్స పొందారు.
ఆమె కుటుంబ పరిస్థితిని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి(Vinay Kumar Reddy) దృష్టికి తీసుకెళ్లగా, ఆయన చొరవతో సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు మంగళవారం రూ.34,000 చెక్కును శారద కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుక్కి ప్రభాకర్, గంగారాం, భూపతి తదితరులు పాల్గొన్నారు.
CMRF Cheques | గుత్పలో..
అక్షరటుడే, ఆర్మూర్ : ఆలూర్ మండలం గుత్ప గ్రామానికి(Guthpa Village) చెందిన ఇద్దరికి సీఎం సహాయనిధి (CMRF) నుంచి ఆర్థికసాయం అందజేశారు. గ్రామానికి చెందిన భూమేశ్వర్, ఎర్ర పెద్దముత్తెన్న ఇటీవల తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందారు. వారి పరిస్థితిని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా..ఆయన చొరవతో సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరయ్యాయి. ఎర్ర పెద్ద ముత్తెన్న, భూమేశ్వరకు రూ.60 వేల చొప్పున మంజూరైన చెక్కులను వారి కుటుంబ సభ్యులకు మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు(Congress Leaders) శశి కుమార్, జితేందర్, భూమేశ్వర్, పోశెట్టి, రాజేష్, నరేష్, స్వామి, సంతోష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.