అక్షరటుడే, ఇందూరు: Deo Ashok | పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజు గురువారం పలు ప్రభుత్వ బడుల్లో పుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. జక్రాన్పల్లి (Jakranpally) మండలం లక్ష్మాపూర్ (Laxmapur) కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో డీఈవో(DEO Ashok) విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలు అందజేశారు. గతేడాది కంటే ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
