అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరాలో అంతరాయం కలగనుంది. పైప్‌లైన్ మరమ్మతుల నేపథ్యంలో 19 గంటల పాటు నీటి సరఫరా ఉండదని జలమండలి అధికారులు తెలిపారు.
నగరానికి తాగునీరు సరఫరా చేసే గోదావరి డ్రింకింగ్ వాటర్ (Godavari Drinking Water) సప్లై పథకంలో పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్పడింది. బొమ్మకల్ పంపింగ్ స్టేషన్ సమీపంలోని శ్రీనివాస్ నగర్ (Srinivas Nagar) బ్రిడ్జి వద్ద 3000 మీమీ డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌కి లీక్ అవుతోంది. దీనికి అధికారులు మరమ్మతులు చేయనున్నారు. నేడు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు మరమ్మతులు కొనసాగనున్నాయి. దీంతో ఈ 19 గంటలు పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.
Hyderabad | అంతరాయం ఏర్పడే ప్రాంతాలు
ఎస్ఆర్ నగర్, సనత్‌నగర్, బోరబండ, ఎస్పీఆర్ హిల్స్, ఎర్రగడ్డ, బంజారాహిల్స్ (Banjara Hills), వెంగల్రావు నగర్, ఎల్లారెడ్డిగూడ, సోమాజిగూడ, ఫతేనగర్ సెక్షన్లు, కూకట్పల్లి, భాగ్యనగర్, వివేకానందనగర్, ఎల్లమ్మబండ, మూసాపేట, భారత్‌నగర్, మోతీనగర్, గాయత్రినగర్, బాబానగర్, కేపీహెచ్‌బీ, బాలాజీనగర్, హస్మత్‌పేట్ సెక్షన్. చింతల్, సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్‌నగర్, గాజులరామారం, సూరారం, ఆదర్శ్‌నగర్, భగత్‌సింగ్ నగర్, జగద్గిరిగుట్ట, ఉషోదయ సెక్షన్లలో తాగునీరు సరఫరా కాదు.అల్వాల్, ఫాదర్ బాలయ్యనగర్, వెంకటాపురం, మచ్చబొల్లారం, డిఫెన్స్ కాలనీ, వాజ్‌పాయినగర్, యాప్రాల్, చాణక్యపురి, గౌతమ్‌నగర్, సాయినాథ్‌పురం సెక్షన్, కాప్రా మున్సిపాలిటీ (Kapra Municipality), 15వ డివిజన్, 18, 21వ డివిజన్లలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం కలగనుంది.