అక్షరటుడే, బిచ్కుంద: Bhu Bharati | భూభారతి చట్టంతో రైతుల(Farmers) భూవివాదాలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(Collector Ashish Sangwan) అన్నారు. శుక్రవారం జుక్కల్, బిచ్కుంద మండలకేంద్రాల్లో నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు భూభారతి పోర్టల్(Bhubharathi Portal) ద్వారా పరిష్కరించుకోవచ్చని రైతులకు సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్లు, వ్యవసాయాధికారులు, మద్నూర్ఏ ఎంసీ ఛైర్మన్ సౌజన్య రమేష్, బిచ్కుద ఏఎంసీ కవిత ప్రభాకర్ రెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
