Homeజిల్లాలుకామారెడ్డిCollector Nizamabad | వివాదాల పరిష్కారం భూభారతితో సాధ్యం

Collector Nizamabad | వివాదాల పరిష్కారం భూభారతితో సాధ్యం

- Advertisement -

అక్షరటుడే, కోటగిరి:Collector Nizamabad | ప్రభుత్వం భూ వివాదాల పరిష్కారానికి ధరణి స్థానంలో భూభారతి(Bhubharati) చట్టం తీసుకొచ్చిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు(Collector Rajiv Gandhi Hanumanthu) పేర్కొన్నారు. కోటగిరి, పోతంగల్ ఉమ్మడి మండలాల రైతులతో మంగళవారం సాయిబాబా ఫంక్షన్ హాల్​లో చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూవివాదాలకు(Land Disputes) తావు లేకుండా రైతులకు పూర్తి యజమాన్య హక్కులు కల్పించేందుకు కొత్త చట్టం తీసుకొచ్చిందన్నారు. ప్రతి గ్రామానికి కొత్తగా రెవెన్యూ ఆఫీసర్లు(Revenue Officers) వస్తారని.. సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్​ వికాస్​ మహతో, తహశీల్దార్, గంగాధర్, ఇన్​ఛార్జి ఎంపీడీవో చందర్, అగ్రికల్చర్ ఆఫీసర్లు, అంగన్​వాడీ టీచర్లు రైతులు తదితరులు పాల్గొన్నారు.