అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PCC Chief Mahesh Goud | మంత్రుల మధ్య వివాదంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ స్పందించారు. అది తమ కుటుంబ సమస్య అని ఆయన పేర్కొన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti) తీరుపై ఇటీవల కొండా సురేఖ భర్త మురళి (Konda Murali) అధిష్టానానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మేడారం (Medaram)లో దేవాదాయ శాఖ పరిధిలో చేపట్టే పనులను ఆయన తన కంపెనీకి ఇచ్చుకున్నారని కొండా మురళి ఆరోపించారు. ఈ వ్యవహారంపై మంత్రులు కొండా సురేఖ (Konda Surekha), సీతక్క (Seethakka) సైతం అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో మహేశ్ గౌడ్ ఆదివారం స్పందించారు.
PCC Chief Mahesh Goud | సీఎంతో మాట్లాడా..
మంత్రులు సీతక్క, కొండా సురేఖ కొన్ని సమస్యలు చెప్పారని మహేశ్ గౌడ్ తెలిపారు. మంత్రుల ఎపిసోడ్‌పై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో మాట్లాడినట్లు ఆయన పేర్కొన్నారు. మంత్రుల మధ్య తలెత్తింది పెద్ద సమస్య కాదన్నారు. సమాచార లోపంతో ఏర్పడిన సమస్య మాత్రమే అని స్పష్టం చేశారు. తాను, సీఎం రేవంత్‌రెడ్డి కూర్చుని సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో ఎవరైనా సమస్య చెప్పుకోవచ్చని ఆయన అన్నారు.
PCC Chief Mahesh Goud | రేపు ఢిల్లీకి..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు (BC Reservations) అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవోపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. ఈ క్రమంలో సోమవారం తనతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఢిల్లీ వస్తున్నట్లు మహేశ్ గౌడ్ తెలిపారు. బీజేపీ బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తుందని ఆయన విమర్శించారు. గవర్నర్ దగ్గర బిల్లులు పెండింగ్‌లో పెట్టి, తమ నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ సంఘాల ఆందోళనకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందన్నారు.