అక్షరటుడే, కామారెడ్డి : Sadashivnagar | సదాశివనగర్ మండలం మల్లుపేట (Mallupeta) గ్రామస్తులతో అధికారుల చర్చలు సఫలం అయ్యాయి. తమ సమస్యలు పరిష్కరించే దాక నామినేషన్లు బహిష్కరిస్తున్నామని గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు.
గ్రామ స్టేజీ వద్ద జాతీయ రహదారిపై (national highway) ప్రత్యేకంగా బ్రిడ్జి ఏర్పాటు చేయాలని, మల్లుపేటను రెవెన్యూ గ్రామంగా చేయాలని ఏళ్ల తరబడి కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీనికి నిరసనగా.. నామినేషన్లు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సదాశివనగర్ ఎంపీడీవో సంతోష్, ఎస్సై పుష్పరాజ్, ఎంపీవో, పంచాయతీ సెక్రెటరీ గ్రామస్తులతో సమావేశమై చర్చించారు. గ్రామస్తుల డిమాండ్‌ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
నామినేషన్లు బహిష్కరించడం సరికాదని సూచించారు. దీంతో గ్రామస్తులంతా మరోసారి సమావేశమై నామినేషన్ వేయడానికి ఒప్పుకున్నారు. సర్పంచ్ పదవికి ఇద్దరు, 8 వార్డులకు 8 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు.