Neeraj Chopra
Neeraj Chopra | నిరాశపరిచిన నీరాజ్ చోప్రా.. గోల్డ్ మెడల్ సాధించిన ట్రినిడాడ్ ఆటగాడు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Neeraj Chopra | భారత స్టార్ అథ్లెట్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా (Olympic medalist Neeraj Chopra) ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు. 27 ఏళ్ల ఈ యువ అథ్లెట్ జ్యూరిచ్లో జరిగిన డైమండ్ లీగ్ పోట్లీ రెండో స్థానంలో నిలిచాడు.

అయితే, టోక్యోలో (Tokyo) మాత్రం అతను తన లక్ష్యాన్ని అందుకోలేకపోయాడు. ఫైనల్లో నాలుగో రౌండ్లో ఓడిపోయాడు. రెండో ప్రయత్నంలో అతడు విసిరిన 84.03 మీటర్లే అత్యధికం. నీరజ్ తన శక్తి మేరకు ప్రయత్నించినకీ విఫలమయ్యాడు. చివరి త్రోలో సరిగ్గా ల్యాండ్ కాకపోవడంతో అనర్హుడిగా మారాడు.

Neeraj Chopra | రాణించిన సచిన్‌ యాదవ్

నీరజ్ నిరాశ పరిచిన తరుణంలో భారత జావెలిన్(Indian javelin)లో మరో కొత్త స్టార్ పుట్టుకొచ్చాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సచిన్ యాదవ్ తన మొదటి ప్రయత్నంలోనే 86.27 మీటర్లు విసిరి సత్తా చాటాడు. అయితే, చివరికి నాల్గవ స్థానంలో నిలిచాడు. ముఖ్యంగా సచిన్ 2024లో బెంగళూరులో జరిగిన 63వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో (63rd National Open Athletics Championships) తొలిసారిగా వార్తల్లో నిలిచాడు.

అప్పటి నుండి స్థిరంగా రాణిస్తున్న అతడు.. 83.67 త్రోతో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఫైనల్స్కు అర్హత సాధించాడు. సమ్మిట్ క్లాష్లో (Summit Clash), అతను 85 మీటర్ల ఎంట్రీపై స్థిరమైన త్రోలతో అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే, టోర్నమెంట్లో మూడవ స్థానంలో నిలిచిన కర్టిస్ థాంప్సన్ను అతడు ఓడించలేకపోయాడు. కేవలం 40 సెం.మీటర్ల తేడాతో కాంస్యం చేజార్చుకున్నాడు.

Neeraj Chopra | కెషోర్న్ వాల్కాట్ స్వర్ణం గెలుచుకున్నాడు

ట్రినిడాడ్, టొబాగోకు (Trinidad and Tobago) చెందిన కెషోర్న్ వాల్కాట్ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలుచుకున్నాడు. అతను గతంలో రెండుసార్లు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, 2012లో లండన్లో స్వర్ణం గెలుచుకున్నాడు. టోక్యోలో, అతను 88.16 మీటర్లు విసిరి గోల్డ్‌ మెడల్‌ సొంతంచేసుకున్నాడు. గత రెండు సంవత్సరాలుగా చాలా స్థిరంగా రాణిస్తున్న ఆండర్సన్ పీటర్స్ రెండవ స్థానంలో నిలిచాడు.