అక్షరటుడే, వెబ్‌డెస్క్:IPO | ఐపీవో ఇన్వెస్టర్ల(Investors)ను మెయిన్ బోర్డ్ ఐపీవోలు నిరాశ పరిచాయి. సోమవారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో రెండు ఐపీవో(IPO)లు లిస్టయ్యాయి. అయితే ఎజిస్ వోపాక్, లీలా హోటల్స్ రెండూ 6.4 శాతం నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించడం గమనార్హం.
IPO | Aegis Vopak Terminals..
మార్కెట్‌నుంచి రూ. 2,800 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఎజిస్ వొపాక్ టర్మినల్స్(Aegis Vopac Terminals) లిమిటెడ్ కంపెనీ ఐపీవోకు వచ్చింది. ఒక్కో షేరును రూ. 235కు ఆఫర్ చేసింది. గతనెల 26నుంచి 28 వరకు బిడ్లను ఆహ్వానించగా.. రిటైల్ ఇన్వెస్టర్లనుంచి స్పందన కరువయ్యింది. ఇష్యూ కోటా సైతం పూర్తిగా సబ్‌స్క్రైబ్ కాలేదు. 0.81 శాతమే సబ్‌స్క్రైబ్ అయ్యింది. మార్కెట్ పరిస్థితులు కూడా బాగా లేకపోవడంతో సోమవారం నెగెటివ్‌గా లిస్టయ్యింది. ఇష్యూ ప్రైస్(Issue price) ఒక్కో షేరుకు రూ. 235 కాగా.. 6.4 శాతం డిస్కౌంట్‌తో రూ. 220 వద్ద లిస్టయ్యింది. ఐపీవోలో కంపెనీ షేర్లు అలాట్ అయినవారికి ఒక్కో షేరుపై రూ. 15 నష్టం వచ్చింది.
IPO | Schloss Bangalore Limited..
స్క్లోస్ బెంగళూరు(హోటల్ లీలా) ఇన్వెస్టర్లనుంచి రూ. 3,500 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవో(IPO)కు వచ్చింది. ఈ కంపెనీకి సైతం రిటైల్ ఇన్వెస్టర్లనుంచి నామమాత్రపు స్పందనే లభించింది. గతనెల 26 నుంచి 28 వరకు బిడ్లను ఆహ్వానించగా.. రిటైల్ కోటా(Retail quota) 0.87 శాతమే సబ్‌స్క్రైబ్ అయ్యింది. లీలా హోటల్ షేర్లు కూడా సోమవారం లిస్టయ్యాయి. కంపెనీ ఐపీవో ప్రైస్ ఒక్కో షేరుకు రూ. 435 కాగా.. 6.4 శాతం నష్టంతో రూ. 406 వద్ద లిస్టయ్యాయి. అంటే ఐపీవో ఇన్వెస్టర్లకు(IPO investors) ఒక్కో షేరుపై రూ. 29 నష్టం వచ్చిందన్న మాట.