ePaper
More
    HomeసినిమాDirector Puri Jagannadh | 36 దేశాలు.. 6400 కి.మీ.. ఆ రూట్‌లో వెళ్తే తిరిగొస్తామో...

    Director Puri Jagannadh | 36 దేశాలు.. 6400 కి.మీ.. ఆ రూట్‌లో వెళ్తే తిరిగొస్తామో లేదో.. పూరి స్ట‌న్నింగ్ కామెంట్స్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : director Puri Jagannadh | డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు అత్య‌ద్భుత‌మైన సినిమాలు చిత్రీక‌రించిన పూరీ ఈ మ‌ధ్య స‌క్సెస్ అందుకోలేక‌పోతున్నాడు. ఇటీవ‌ల ‘డబుల్ ఇస్మార్ట్’ double ismart పరాజయంతో పూరి జగన్నాథ్​ Puri Jagannadh త‌న త‌దుప‌రి చిత్రం ఎలాగైన హిట్ కొట్టాల‌ని క‌సితో పని చేస్తున్నాడు. ఇటీవ‌ల ‘మక్కల్ సెల్వన్ ‘విజయసేతుపతి Vijay sethupathi తో తన నెక్స్ట్ మూవీ చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో pan india level నిర్మాణం జరుపుకోబోతున్న ఈ మూవీని పూరి కనక్ట్స్ puri conects, ఛార్మి అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.

    director Puri Jagannadh | పూనీ స్ట‌న్నింగ్ కామెంట్స్..

    పూరి జగన్నాథ్​ puri jagannadh చాలా కాలం నుంచి సోషల్ మీడియా social media వేదికగా ‘పూరి మ్యూజింగ్స్‌’ అనే ప్రోగామ్ program చేస్తూ అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్లడిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ‘సిల్క్ రోడ్ Silk Road అనే అంశంపై మాట్లాడుతు పూర్వం చైనా నుంచి యూరప్ china and europe దాకా ఒక కనెక్టింగ్ రూట్ ఉండేది. దానిపేరే సిల్క్ రూట్. ఆరు వేల నాలుగువందల కిలోమీటర్ల దూరంతో ముప్పై ఆరు దేశాలని కలుపుతుంది. ఈ రూట్‌లో వెళ్తే తిరిగి ప్రాణాలతో వస్తామో లేదో ఎవరికీ తెలియదు. చైనా china, మంగోలియా mongolia, ఇండియా india, పాకిస్థాన్ pakistan, ఇరాన్ iran, ఇరాక్ iraq, ఈజిప్టు, ఇటలీ ఇలా అన్ని దేశాలు కనక్ట్ అయ్యి ఉంటాయి. గోబీ, తక్లమకన్ లాంటి ఎడారులు దాటుకుంటూ, ఇసుక తుఫానుల మధ్య ప్రయాణం travel చేయాలి. ఒంటెలు, గుర్రాలు horse లేకుండా ఎవరూ ట్రావెల్ చేయలేరు.

    హాన్ సామ్రాజ్యం ఉన్న స‌మ‌యంలో చైనా china సెంట్ర‌ల్ ఆసియాతో Central Asia వ్యాపారం చేయ‌డం మొద‌లుపెట్టింది. 36 దేశాలను కలుపుతూ దాదాపు 6,400 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్న ఈ ప్రాచీన వాణిజ్య మార్గం నిజంగానే సాహసోపేతమైన ప్రయాణంగా ఉండేది. చైనా, మంగోలియా, ఇండియా, పాకిస్థాన్, ఇరాన్, ఇరాక్, ఈజిప్ట్, కజకిస్థాన్, సిరియా, టర్కీ వంటి ఇలా ఎన్నో దేశాలను కలుపుతూ ఈ రూట్ route ఉండేది. ఈ రూట్లో వెళ్లినవారు ప్రాణాల‌తో తిరిగివ‌చ్చిన వారు చాలా త‌క్కువ‌. చాలా ప్రమాదకరమైన మార్గ‌మిది dangerous route. ఎందుకంటే గోబీ వంటి ఎడారుల‌ను దాటుకుంటూ వెళ్లాలి. ఇసుక తుఫాన్లను sandstorms దాటాలి. పైగా విపరీతమైన హై టెంపరేచర్స్ high temperatures ఉండేవి. ఒంటెలు, గుర్రాలు camels and horses లేకుండా ఎవరూ ట్రావెల్ travel చేసేవారు కాదు. చైనా china నుంచి టర్కీలో turky ఉన్న అనటోలియా అనే ప్ర‌దేశం చేరాలంటే ఒక సంవత్సరం పైనే ప‌ట్టేది. ఇందులో సిల్క్ ఒకటే కాదు ఇండియా నుంచి మసాలా, కుంకుమ, దాల్చిన చెక్క, మిరియాలు ఎగుమ‌తి అయ్యేవి. చైనా నుంచి ఏనుగు దంతాలు, రోమ్ నుంచి బంగారం, వెండి gold and silver వంటి విలువైన వస్తువులు ఈ మార్గం ద్వారా ఒకరి నుంచి మరొకరికి చేరేవి. ఇలా ఎన్నో రకాల వ్యాపారాలు జోరుగా సాగేవి అని ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

    ఈ రూట్‌ మధ్యలో దోపిడీ దొంగలు దాడి చేసేవార‌ని తెలిపాడు. వారినుంచి త‌ప్పించుకోవ‌డానికి అందరూ వెయ్యి ఒంటెలతో thousand camels ప్రయాణించేవారు. ఈ రూట్‌లో వ్యాపారం చేయాలంటే కత్తి పట్టుకొని బయల్దేరాల‌న్నాడు. దాదాపు 1500 సంవత్సరాల పాటు ప్రపంచమంతా ఈ సిల్క్ రోడ్‌నే Silk Road ప్రధాన వాణిజ్య మార్గంగా main trade route ఉపయోగించిందని తెలిపారు. ఈ మార్గంలో వ్యాపారం చేసేవారు ఒక ప్రత్యేకమైన భాషను special language ఉపయోగించేవారని, దాని పేరు “మాలి” mali అని ఆయన వెల్లడించారు. ఆ తర్వాత సముద్ర మార్గం కనుగొనబడడంతో, సిల్క్ రోడ్డు silk road ద్వారా జరిగే ప్రయాణాలు క్రమంగా తగ్గిపోయాయని పూరి వివరించారు. అయితే, ప్రపంచీకరణకు World Globalization ఇది మొట్టమొదటి కారణంగా నిలిచిందన్నారు. సంస్కృతి, సాంకేతికత, మతాలు ఇలా ఎన్నో విషయాలు ఈ మార్గం ద్వారానే ఒకరి నుంచి మరొకరికి చేరాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికీ కొంతమంది యాత్రికులు సాహసం కోసం ఈ సిల్క్ రోడ్‌లో ప్రయాణిస్తున్నారని పూరి తెలియజేశారు.

    More like this

    Nepal | నేపాల్‌లో భ‌యాన‌క దృశ్యాలు.. తాడుకు వేలాడిన మంత్రులూ, ఫ్యామిలీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌లో ఇటీవల సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన నిషేధం, రాజకీయ అవినీతి,...

     AP Government | ఏపీలో 60ఏళ్ల పురుషులు, 58 ఏళ్ల మ‌హిళ‌ల‌కి శుభ‌వార్త‌.. ద‌ర‌ఖాస్తు ఫీజు కూడా లేద‌ట‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : AP Government | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Government) సీనియర్ సిటిజన్ల కోసం జారీ చేసే...

    Stock Market | స్తబ్దుగా దేశీయ స్టాక్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Domestic Stock Market) స్తబ్ధుగా సాగుతోంది. స్వల్ప...