అక్షరటుడే, వెబ్‌డెస్క్: Director Krish | పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ (HHVM) జులై 24న ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తొలుత క్రిష్ జగర్లమూడి రచయితగా, దర్శకుడిగా వ్యవహరించారు. అయితే, సినిమా పూర్తవ్వకముందే క్రిష్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో నిర్మాత ఏఎమ్ రత్నం (producer AM Ratnam) కుమారుడు ఏఎమ్ జ్యోతి కృష్ణ మిగిలిన సినిమా పనులను పూర్తి చేశారు. ఈ తరుణంలో తను ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంపై ఎప్పుడు స్పందించని క్రిష్, తాజాగా ఓ ఇంటర్వ్యూలో మొట్టమొదటిగా తన స్పందన తెలియజేశాడు.
Director Krish | మున్ముందు తెలుస్తాయి..
పవన్ కళ్యాణ్‌తో నాకు ఎలాంటి విభేదాలూ లేవు. సమయం వచ్చినప్పుడు మళ్లీ కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని స్పష్టం చేశారు. ఇక చిత్రం మధ్యలో నుంచి తప్పుకోవడానికి గల కారణాలు త్వరలోనే అందరికీ తెలుస్తాయని క్రిష్ (Director Krish) పేర్కొన్నట్టు సమాచారం. ఇక హరిహర వీరమల్లు ప్రమోషన్ల సమయంలో పవన్ కళ్యాణ్.. క్రిష్‌పై ప్రశంసలు గుప్పించారు. మంచి కథను తన దగ్గరకు తీసుకువచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పవన్ అభిమానులూ, సినీ వర్గాలూ కూడా వీరిద్దరూ త్వరలో మరోసారి కలిసి పని చేయాలన్న ఆశతో ఉన్నారు.
ఇక సినిమా విషయానికి కొస్తే, హరిహర వీరమల్లు చిత్రం బాక్సాఫీస్ దగ్గర మిక్స్‌డ్ రెస్పాన్స్ అందుకుంది. రెండో రోజు కలెక్షన్లు గణనీయంగా తగ్గిపోవడంతో, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పెద్దగా రాణించలేకపోయింది. గత ఐదేళ్లుగా వివిధ కారణాల వల్ల వాయిదాలు పడ్డ హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu) సినిమా ఎట్టకేలకు జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు ముందు హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌తో పాటు, శిల్పకళావేదికలో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఆ తర్వాత విశాఖపట్నంలోనూ ఓ ఈవెంట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడిపై ప్రశంసల వర్షం కురిపించడం మనం చూశాం. అలానే క్రిష్ కూడా మూవీ రిలీజ్‌కు ముందు పవన్, ఏఎం రత్నం వల్లనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిందని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.