Homeజిల్లాలునిజామాబాద్​Mendora Mandal | దూదిగాంలో గాలికుంటు టీకా శిబిరం

Mendora Mandal | దూదిగాంలో గాలికుంటు టీకా శిబిరం

మెండోరా మండలంలోని దూదిగాం గ్రామంలో పశు వైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని 235 పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు.

- Advertisement -

అక్షరటుడే, మెండోరా: Mendora Mandal | మండలంలోని దూదిగాం గ్రామంలో (Dudigam village) పశు వైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని 235 పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసినట్లు సిబ్బంది తెలిపారు.

ఇదిలా ఉండగా, టీకా శిబిరాన్ని పశుసంవర్ధక శాఖ (Animal Husbandry Department) అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్​ గంగాధరయ్య శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గాలికుంటు వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై పాడి రైతులకు పలు సూచనలు చేశారు. అలాగే  మెండోరాలో శనివారం శిబిరం ఉంటుందని, పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వెటర్నరీ వైద్యుడు గౌతమ్‌ రాజు, సిబ్బంది ప్రవీణ్, ప్రణీత్‌ గోపాలమిత్ర మల్లేశ్, షకీల్‌, గ్రామస్థులు బోలిశెట్టి కల్యాణ్, నాగుల పెద్ద నర్సయ్య, గొల్ల గంగాధర్, పసుల ఉషన్న, భూమన్న, చి రాజశేఖర్, జి రాజేందర్, మమ్మాయి రాజేందర్ పాల్గొన్నారు.