ePaper
More
    HomeతెలంగాణDinesh Kulachary | స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేస్తాం

    Dinesh Kulachary | స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేస్తాం

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Dinesh Kulachary | స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body elections) కాషాయ జెండా ఎగరేయడం ఖాయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం మహాజన సంపర్క్​ అభియాన్ (Mahajana Sampark Abhiyan) సమావేశం నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త బూత్​స్థాయి నుంచి ప్రతి ఇంటికి చేరుకొని నరేంద్ర మోదీ (PM Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేర్లు మార్చి క్రెడిట్ తీసుకుంటుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తుందే తప్ప చేసిందేమీ లేదన్నారు. ఉపరాష్ట్రపతి (Vice President) అభ్యర్థిగా ఎన్డీఏ నుంచి బీసీ అభ్యర్థి నిలబడితే కాంగ్రెస్ కావాలని ఓడగొట్టాలని కంకణం కట్టుకుందన్నారు.

    Dinesh Kulachary | గెలుపు గుర్రాలకే టికెట్లు

    ఎంపీ ధర్మపురి అర్వింద్​ (MP Arvind) నేతృత్వంలో జిల్లాలో రెండుసార్లు సర్వే నిర్వహించారని దినేష్ కులాచారి స్పష్టం చేశారు. గెలుపు గుర్రాలకే టికెట్ కేటాయించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

    Dinesh Kulachary | బూత్​ కమిటీలను ఏర్పాటు చేయాలి

    జాతీయ పసుపు బోర్డు (National Turmeric Board) ఛైర్మన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ బూత్ కమిటీలను (Booth Committee) త్వరగా ఏర్పాటు చేయాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందని హామీ ఇచ్చారు. ఎంపీ అర్వింద్ (MP arvind)​ ధర్మపురి కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి వారికి అండగా నిలుస్తున్నారని గుర్తుచేశారు.

    బలమైన బూత్ ఉంటే సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు గెలవగలమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, నాయకులు గంగారెడ్డి, స్రవంతి రెడ్డి, పోతన్​కర్ లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, నాగోల్ల లక్ష్మీనారాయణ, పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు

    Latest articles

    Delhi CM | దాడిపై స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి.. తమ నిబద్ధతను విచ్ఛిన్నం చేయలేరన్న రేఖా గుప్తా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delhi CM | ఢిల్లీ సంక్షేమం కోసం చూపుతున్న తన నిబద్ధతను భౌతికు దాడుల...

    Mla madan Mohan Rao | దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Mla madan Mohan Rao | గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నియోజకవర్గంలో పంటలు...

    Vande Bharat​ | రైల్వే ప్రయాణికులకు శుభవార్త​.. ఆ స్టేషన్​లో ఆగనున్న వందేభారత్​ ఎక్స్​ప్రెస్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vande Bharat​ | రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యార్థం అనేక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే...

    CBI Trap | లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన ఎన్​హెచ్​ఏఐ పీడీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CBI Trap | లంచం తీసుకుంటూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (National Highways...

    More like this