HomeతెలంగాణDinesh Kulachary | అర్హులైన పేదలకు ఇళ్లను కేటాయించాలి

Dinesh Kulachary | అర్హులైన పేదలకు ఇళ్లను కేటాయించాలి

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Dinesh Kulachary | అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి కోరారు. జిల్లా కేంద్రంలోని బైపాస్​లో గల కలెక్టరేట్ వెనకాల డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మించిన ఇళ్లను పేదలకు కేటాయించకపోవడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంటున్నాయన్నారు. కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతోందన్నారు. పిచ్చిమొక్కలు పెరగడం, కిటికీలు, తలుపులు పూర్తిగా ధ్వంసం అయ్యాయన్నారు.

Dinesh Kulachary | పేదలతో కలిసి గృహప్రవేశం చేస్తాం..

ఇళ్లను పరిశీలించిన అనంతరం దినేష్​ మున్సిపల్​ కమిషనర్​ దిలీప్​ కుమార్​ను కలిశారు. ఇళ్లకు మరమ్మతులు చేయించి ఆగస్టు 15లోపు అర్హులైన పేదలకు కేటాయించాలని దినేష్​ డిమాండ్ చేశారు. లేకపోతే పేదలతో కలిసి ఇళ్లలో గృహప్రవేశం చేస్తామని స్పష్టం చేశారు.

Dinesh Kulachary | డివిజన్ల పెంపుపై సమాచారం లేదు..

నిజామాబాద్ నగరంలో డివిజన్ల పెంపుపై కమిషనర్​ను ప్రశ్నించారు. దీంతో ఆయన స్పందించారు. డివిజన్ల పెంపుపై తమకు ఎలాంటి సమాచారం లేదని వివరించారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం అందలేదన్నారు. అటువంటి ఆలోచన ఏదైనా ఉంటే ముందుగా అన్ని పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు పోతన్​కర్​ లక్ష్మీనారాయణ, మాజీ కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు.