అక్షరటుడే, ఇందూరు: Dinesh Kulachari | రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా జిల్లా సమస్యలను పట్టించుకోవడంలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (BJP District President Dinesh Kulachari) అన్నారు.
పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా నుంచి పీసీసీ అధ్యక్షుడిగా(PCC Chief) మహేష్ కుమార్ గౌడ్ ఉన్నా.. ఫలితం లేకుండా పోయిందన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు ఈ నిర్లక్ష్య ధోరణిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా మంత్రి పదవి ఇవ్వలేరని పేర్కొన్నారు.
మాధవనగర్ (Madavanagar) రైల్వే ఓవర్ బ్రిడ్జి (Railway over bridge) ఆలస్యం కావడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. రాష్ట్ర నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంతోనే పనులు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో రాష్ట్రస్థాయి నేతలు ఉన్న అభివృద్ధి చేయడం లేదని, కనీసం మంత్రి పదవికి నోచుకోవడం లేదనన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా నాయకులు పోతన్కర్ లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, నాగోల్ల లక్ష్మీనారాయణ, స్రవంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.