Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad Congress | అభివృద్ధిని చూడలేకనే భూపతిరెడ్డిపై దినేష్​ ఆరోపణలు

Nizamabad Congress | అభివృద్ధిని చూడలేకనే భూపతిరెడ్డిపై దినేష్​ ఆరోపణలు

రూరల్​ నియోజకవర్గంలో అభివృద్ధిని చూడలేకనే ఎమ్మెల్యే భూపతిరెడ్డిపై బీజేపీ జిల్లాధ్యక్షుడు దినేష్​ ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్​ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad Congress | నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి  తన నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిని చూడలేకనే.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి (Dinesh Kulchari) అనవరస ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అన్నారు.

కాంగ్రెస్ భవన్​లో (Congress Bhavan) శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిజామాబాద్ డివిజన్ ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్, రూరల్ అధ్యక్షుడు ఎల్లయ్య మాట్లాడారు. నిజామాబాద్ రూరల్ పరిధిలోని మల్కాపూర్​లో అక్రమ మొరం దందా చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించడం సరికాదన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (MLA Bhupathi Reddy) ఎంతో మందికి సేవచేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. దినేష్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు నిరూపించకపోతే తగిన బుద్ధి చెప్తామని అన్నారు. లేదంటే పదేపదే ఆరోపణలను మానుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల (Indiramma House) విషయంలో అధికారులు పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇస్తున్నారని పేర్కొన్నారు.

Must Read
Related News