అక్షరటుడే, ఇందూరు : Dillod Soni Akash Campaign | సేవ చేసేందుకు ఒక్కసారి అవకాశమివ్వాలని 9వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థిని (BRS Candidate) డిల్లోడ్ సోని ఆకాష్ రాథోడ్ అన్నారు. సాయినగర్ (Sainagar) తదితర కాలనీల్లోని ప్రజలను కలుస్తూ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.
Dillod Soni Akash Campaign | బిగాల హయాంలో నగరంలో అభివృద్ధి..
నగరంలో బీఆర్ఎస్ హయాంలో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా (Bigala Ganesh Gupta) ఆధ్వర్యంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరిగిందని సోని ఆకాష్ అన్నారు. అదే స్ఫూర్తితో డివిజన్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. డివిజన్లో ప్రభుత్వ పథకాల (Government Schemes) అమలు కోసం కృషి చేస్తామన్నారు. కాలనీల్లో పలుచోట్ల రోడ్లు లేవని, నల్లా నీళ్లు రావట్లేదని ఫిర్యాదులు ఉన్నాయన్నారు. వాటి పరిష్కారిస్తూ ముందుకు వెళ్తామని పేర్కొన్నారు.
పోరాడైనా నిధులు సాధిస్తాం..
ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామని డిల్లోడ్ సోని ఆకాష్ అన్నారు. డివిజన్‌కు రావాల్సిన నిధులను పోరాడి సాధిస్తామని అభివృద్ధి చేసేందుకు ఒక్కసారి తనకు కార్పొరేటర్‌గా అవకాశం ఇవ్వాలని ఆమె ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
