అక్షరటుడే, బాన్సువాడ: Banswada | పట్టణంలోని సంగమేశ్వర కాలనీ చౌరస్తాలో శిథిలావస్థకు చేరిన నీటి ట్యాంకును (water tank) తొలగించాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఇదివరకే పలుమార్లు మున్సిపల్ అధికారుల (municipal Officals) దృష్టికి తీసుకెళ్లినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు.
ట్యాంకు ఎప్పుడు కూలుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీకి వెళ్లే రోడ్డు పక్కనే ట్యాంకు ఉండడంతో ప్రమాదం పొంచి ఉందన్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి ట్యాంకును తక్షణమే కూల్చివేసి, కొత్తది నిర్మించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొణాల గంగారెడ్డి, జిల్లా కౌన్సిలింగ్ సభ్యుడు ప్రసాద్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఉమేష్, ఉపాధ్యక్షుడు అనిల్, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకట్ల రాజు, సాయి కిరణ్, హన్మాండ్లు, నాగరాజ్, తదితరులు పాల్గొన్నారు.