HomeUncategorizedDilraju wife | సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న దిల్ రాజు భార్య‌.. కొంప‌దీసి హీరోయిన్‌గా...

Dilraju wife | సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న దిల్ రాజు భార్య‌.. కొంప‌దీసి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందా ఏంటి?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Dilraju wife | తెలుగు చిత్ర పరిశ్రమలో బడా నిర్మాతగా పేరు సంపాదించుకున్న దిల్‌రాజు Dil Raju (వెంకట రమణా రెడ్డి)కు తొలుత అనితతో వివాహం జరిగిన విష‌యం తెలిసిందే. ఈ దంపతులకు హన్షితా రెడ్డి సంతానంగా జ‌న్మిచింది. అయితే 2017లో గుండెపోటుతో మొదటి భార్య హఠాన్మరణం చెంద‌డంతో కొన్నాళ్ల పాటు విషాదంలో ఉన్నారు దిల్ రాజు. అయితే భార్య మరణంతో కుంగిపోయిన దిల్‌రాజు.. కుమార్తె, ఇతర పెద్దల ఒత్తిడి వ‌ల‌న 2020లో తేజస్విని అనే యువ‌తిని పెళ్లాడారు. ఈ దంపతులకు అన్వయ్ రెడ్డి అనే కుమారుడు జన్మించాడు. తేజస్విని రాకతో తన జీవితం మలుపు తిరిగిందని దిల్‌రాజు ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో చెప్పుకొచ్చాడు.

Dilraju wife | తేజ‌స్విని ఏంటీ ర‌చ్చ‌..

ఇదిలా ఉండగా, తేజస్విని Tejaswini ఇటీవల లా డిగ్రీ పూర్తి చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. భర్త దిల్‌రాజు ప్రోత్సాహంతోనే తాను ఈ విద్యను పూర్తి చేయగలిగానని తేజస్విని తెలిపారు. వ్యక్తిగత జీవితం, విద్య, ఆధ్యాత్మికతను సమతుల్యంగా కొనసాగిస్తున్న ఈ జంటను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇటీవ‌ల తేజ‌స్విని సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. వెరైటీ డ్రెస్సుల‌లో ఫోటో షూట్స్ చేస్తూ అద‌ర‌గొడుతుంది. హీరోయిన్స్‌ను మించి ఈ అమ్మ‌డు ర‌చ్చ చేస్తున్న నేప‌థ్యంలో నెటిజ‌న్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఏంటి సంగ‌తి.. హీరోయిన్ అయిపోతావా.. ఈ మ‌ధ్య ఎక్క‌డ చూసినా నీ ఫొటోస్ క‌నిపిస్తున్నాయి అని అంటున్నారు. వెరైటీ స్టిల్స్ ఇస్తూ వాటిని సోష‌ల్ మీడియాలో వస్తున్న ఆమె ఫొటోలు రచ్చ చేస్తున్నాయి.

ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న తేజ‌స్విని ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకుంది. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్​లోనే (Hyderabad) అని తెలిపింది. చిన్నప్పట్నుంచి నా స్టడీ అంతా కూడా హైద‌రాబాద్‌లోనే.. సెయింట్ యాన్స్​లో స్కూలింగ్ చేశాను. శ్రీ చైతన్యలో ఇంటర్ చదివాను. కస్తూర్బా గాంధీ కాలేజీలో డిగ్రీ చదివాను. నాచారం సెయింట్ పియస్ కాలేజీలో బయో కెమిస్ట్రీలో పీజీ చేశానని పేర్కొంది. మా అమ్మ హైకోర్టు అడ్వకేట్ కావ‌డంతో పీజీ తర్వాత లా చదివాల్సి వ‌స్తుంది. లా చదువుతున్నప్పుడే పెళ్లి కావ‌డంతో, పెళ్ల‌య్యాక అంటే 2024లోనే లా పూర్తి చేశాను. నేను స్టడీస్​లో టాపర్​నని చెప్పుకొచ్చిన తేజ‌స్విని క్లాసికల్ డ్యాన్సర్ అనే విష‌యం కూడా రివీల్ చేసింది.

Must Read
Related News