అక్షరటుడే, వెబ్‌డెస్క్: Dil raju | టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు (Dil raju) ఒక వైపు బడా సినిమాలు చేస్తూనే మరోవైపు చిన్న చిత్రాలతో ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇప్పుడు దిల్ రాజు నిర్మాణంలో నితిన్ (Nithin) హీరోగా తమ్ముడు అనే చిత్రం తెరకెక్కగా, ఈ మూవీ జులై 4న రిలీజ్ కానుంది. మరి కొద్ది రోజులలో మూవీ విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచారు. ఇందులో భాగంగా దిల్ రాజు – నితిన్ (Dil Raju – Nithin) ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. ఇందులో ఇద్దరూ వ్యక్తిగత అనుభవాలు, కెరీర్ జర్నీ, ఫెయిల్యూర్స్, ఫ్యూచర్ పై ఓపెన్‌గా మాట్లాడుకున్నారు.
Dil raju | అలా అనేశాడు..
దిల్ రాజు మాట్లాడుతూ జయం సినిమా విడుదలకు ముందే నితిన్‌తో సినిమా (Nithin Movie) చేయాలని నిర్ణయించుకున్నాం. ఒకసారి వినాయక్ గారితో కారులో వెళ్తున్నప్పుడు జయం పోస్టర్ (Jayam Poster) చూసి, వెంటనే ‘దిల్’ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాం అని గుర్తుచేసుకున్నారు. అనంతరం మీరు హీరో అవాలనే ఇండస్ట్రీకి (Industry) వచ్చారా? అని నితిన్ అడగగా, దానికి దిల్ రాజు స్పందిస్తూ ..నాకు దర్శకుడిగా మారాలని ఎప్పుడూ అనుకోలేదు. వినాయక్ గారు సలహా ఇచ్చారు కానీ, నా దృష్టి ఎప్పుడూ కంటెంట్ మీదే ఉంది అని అన్నారు. అలాగే గేమ్ ఛేంజర్ సినిమా (Game changer movie) ఆశించిన స్థాయిలో ఆడదన్న ఆలోచన తనకు ముందే వచ్చిందని, అయితే అదే సమయంలో సంక్రాంతికి విడుదల కానున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki vasthunam) చిత్రం గురించి పూర్తి నమ్మకముందని తెలిపారు.
దిల్ నుంచి తమ్ముడు వరకూ నాలో మార్పులేంటి? అని నితిన్ ప్రశ్నించగా, దానికి దిల్ రాజు ధైర్యంగా స్పందించారు. నీకు ఉన్న టాలెంట్ ప్రకారం నేను ఊహించిన స్థాయిలో ఎదగలేకపోయావ్. అల్లు అర్జున్‌ని (Allu arjun) ‘ఆర్య’ (Aarya) టైంలో చూసినట్టు, నిన్ను ‘దిల్’ టైంలో చూసి ఫ్యూచర్ స్టార్‌గా భావించాను. కానీ ఆ స్థాయికి నువ్వు చేరలేదు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పారు. ‘తమ్ముడు’ సినిమా (Thammudu Movie) నితిన్‌కు విజయం తీసుకొస్తుందన్న నమ్మకం తనకు ఉందని దిల్ రాజు స్పష్టంగా చెప్పారు. అయితే ఒక్క హిట్ సరిపోదని, నిజమైన రీ-ఎంట్రీ ‘ఎల్లమ్మ’ వంటి సినిమాతో రావాలంటూ పరోక్షంగా సూచించారు. నితిన్ కెరీర్‌లో ఈసారి తమ్ముడు మూవీ టర్నింగ్ పాయింట్ కావొచ్చు, కానీ దిల్ రాజు చెప్పినట్లు, ఒక్క సినిమా విజయం సరిపోదు. నిజమైన రీ-ఎస్టాబ్లిష్‌మెంట్ కోసం అద్భుతమైన కంటెంట్ తో మరో హిట్ అవసరం.
1 comment
[…] రాజు (Dil Raju) ఈ సినిమా హక్కులను తన దగ్గరే […]
Comments are closed.