Dil Raju
Dil Raju | ఇండస్ట్రీలో కొంద‌రు నీచంగా ప్రవ‌ర్తిస్తున్నారు..తొలి రోజే గేమ్ చేంజ‌ర్ పైర‌సీ వ‌చ్చిందంటూ దిల్ రాజు కామెంట్స్

అక్షరటుడే, వెబ్​డెస్క్:Dil Raju | థియేటర్ల బంద్ Theatres bundh వ్యవహారం, పవన్ కల్యాణ్ లేఖ తదితర అంశాలపై టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఎట్ట‌కేల‌కు స్పందించారు.

ఆ న‌లుగురు వ‌ల్ల‌నే థియేట‌ర్స్ బంద్ అనే విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చిందనే ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో దిల్ రాజు(Dil Raju) కీలక వ్యాఖ్యలు చేశారు. “ఏప్రిల్ 19న ఈస్ట్ గోదావరిలో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అప్పుడు వాళ్ళు మాకు పర్సంటేజ్ అయితే బాగుంటుంది. ఇలా అయితే థియేటర్స్ నడపలేము అని మాట్లాడుకున్నారు. థియేటర్ల మూసివేత వద్దని 24న మీటింగ్ పెట్టాం. కానీ, ఈలోపు విషయం డైవర్ట్‌ అయిపోయింది. పవన్ కల్యాన్‌(Pawan Kalyan) సినిమాపైకి విషయం వెళ్దిలింది” అని నిర్మాత దిల్ రాజు వ్యాఖ్యానించారు.

Dil Raju | వారి వ‌ల్లే..

“హరిహర వీరమల్లు Harihara veeramallu సినిమా మేలో విడుదలవుతుందని చెప్పారు. తర్వాత కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడిందని తెలిపారు. పవన్‌ కల్యాణ్ సినిమాను ఆపే దమ్ము, ధైర్యం ఎవరూ చేయరు. సినిమా విడుదల, టికెట్‌ రేట్ల విషయంలో నిర్మాతలకు పవన్ కల్యాణ్‌ పూర్తి మద్దతు తెలిపారు. ఎవరికి వారే వారి సినిమాలను గురించి అడుగుతున్నారు. ఫిలిం ఛాంబర్‌(Film Chamber)లోనే యూనిటీ లేదు. పవన్‌ కల్యాణ్ సినిమాను టార్గెట్ చేశామనడం తప్పన్నారు. గేమ్‌ చేంజర్‌ (Game Changer) మూవీ తొలిరోజే పైరసీ వచ్చింది. ఆ పైరసీ చేసింది కూడా మరో నిర్మాతే కావచ్చు. ఇండస్ట్రీలో కొందరు నీచంగా ప్రవర్తిస్తున్నారన్నారు” దిల్ రాజు.

“తెలంగాణ(Telangana)లో 370 థియేటర్లు ఉంటే నాకు 30 థియేటర్లున్నాయి. పర్సంటేజ్‌ విధానం ఉంటే బాగుంటుందని కొందరు చెప్పారు. ఆరు నెలలుగా వస్తున్నా.. రెవెన్యూ గురించి ఆరా తీశాం. రెంట్‌, పర్సెంటేజ్‌ పద్దతిలో ఆడే సినిమాలపైనే వివాదం నెలకొందన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కొందరు ఎగ్జిబిటర్లు , డిస్ట్రిబ్యూటర్లు Distributors భేటీ అయ్యారు. ఎగ్జిబిటర్ల మీటింగ్‌తో అసలు టాపిక్‌ మొదలైంది” అని దిల్ రాజు అన్నారు.

ఇది ఆ జిల్లా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల విషయం మాత్రమే. సినిమాలకు మొదటి వారం రెంట్‌ ఇస్తాం. రెండో వారం నుంచి పర్సెంటేజ్‌ ఇస్తున్నాం. నష్టమెందుకు వస్తుందో ఆరాతీశామన్నారు. కొన్ని రోజులుగా రెంటల్‌ పద్దతిలో సినిమాలు ప్రదర్శించడం సాధ్యం కాదని ఓ వైపు ఎగ్జిబిటర్లు అంటుండగా.. మరోవైపు వారికి పర్సంటేజీలు ఇవ్వలేమని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. ఈ వ్యవహారం నిర్మాతలకు ఇబ్బందిగా మారుతోంది అని ఆయన వ్యాఖ్యానించారు.