HomeUncategorizedDil Raju | సినిమా టిక్కెట్ ధ‌ర‌లు పెంచబోం.. దిల్ రాజు కీల‌క వ్యాఖ్య‌లు

Dil Raju | సినిమా టిక్కెట్ ధ‌ర‌లు పెంచబోం.. దిల్ రాజు కీల‌క వ్యాఖ్య‌లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Dil Raju | కొంత కాలంగా సినిమా టిక్కెట్ ధ‌ర‌లు(Movie ticket prices) పెంచుతుండ‌డం సామాన్యుల‌కు ఇబ్బందిగా మారింది. దీనిపై అనేక విమ‌ర్శ‌లు వ్య‌క్తమవుతున్న నేప‌థ్యంలో దిల్ రాజు Dil raju స్పందించారు. ‘ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం నిర్మాతల బాధ్యత. ఇకపై తెలంగాణ(Telangana)లో టికెట్‌ ధరలు పెంచడం ఉండదు. ఈ విషయాన్ని తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘంలోనూ చర్చించాం. ఇక హీరోలు రెమ్యునరేషన్‌ విషయంలో పునరాలోచించుకోవాలి. నా సినిమాలకు టికెట్‌ ధరలు పెంచను’ అన్నారు అగ్ర నిర్మాత దిల్‌రాజు. ఆయన నిర్మాణంలో నితిన్‌ హీరోగా శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో రూపొందిన ‘తమ్ముడు’(Thammudu) చిత్రం జూలై 4న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ క్ర‌మంలో నిర్వ‌హించిన ప్ర‌మోష‌నల్ ఈవెంట్​లో ఆయ‌న ఈ కామెంట్స్ చేశారు.

‘యూట్యూబ్​లో(Youtube) ట్రైలర్ రిలీజ్ చేశాం. అక్కడ వచ్చే నెంబర్స్ ఉంటాయి కదా. అన్ని ఒరిజినల్. ప్రేక్షకులు చూసే నెంబర్స్ మాత్రమే అక్కడ ఉండాలని మా ఆఫీస్​లో ఖరాకండీగా చెప్పేసాను. బిలియన్స్, మిలియన్స్ డబ్బులు పెట్టి కొనకండి. ఎందుకంటే.. ఒరిజినల్​గా మన సినిమా ట్రైలర్ కానీ, సాంగ్ కానీ ఎంత రీచ్ అవుతుందో మనకు తెలిస్తే సినిమా ప్రేక్షకులకు ఎంత రీచ్ అవుతుందో తెలుస్తుంది. మనం కొనేసుకుని ఇచ్చే నెంబర్​తో అక్కడ నెంబర్ మాత్రమే కనిపిస్తుంది కానీ, అది ప్రేక్షకుడికి రీచ్ అయ్యిందా.. ? అవ్వడం లేదా.. ? అనేది తెలియడం లేదు. అందుకే కొంచెం కష్టమైన నేనే మొదటి స్టెప్ వేశాను’ అని అన్నారు.

‘నేను ఎవరిని ఉద్దేశించి ఈ మాట అనడం లేదు. జెన్యూన్​గా మన సినిమా ఎలా రీచ్ అవుతుంది అనేది మనకు తెల్సినప్పుడే ఏది రీచ్ అవుతుంది..? ఏది అవ్వడం లేదు అనేది తెలుస్తుంది. రీచ్ అవ్వకపోతే ఏం చేయాలి..? అనేది తెలుస్తుంది. దానికొక అవేర్నెస్ ఉండాలి. దానికోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను. విషయం ఉంటే సినిమా అదే రీచ్ అవుతుంది. లేకపోతే ప్రేక్షకులే రిజెక్ట్ చేస్తారు. ఇంకెందుకు టెన్షన్. అందుకే వద్దు వ్యూస్ కొనకండి అని చెప్పాను. తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన స్టార్ హీరోలే వెన్ను తట్టి సపోర్ట్ అందించారు’ అని తెలిపారు. బృందావనం సమయంలో ఎన్టీఆర్ కానీ మిస్టర్ పర్ఫెక్ట్ సమయంలో ప్రభాస్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సమయంలో మహేష్ Mahesh babu గాని అలాగే వకీల్ సాబ్ సమయంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కానీ వీరే ఎంతో సపోర్ట్ చేశారని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

Must Read
Related News